ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి

ABN, Publish Date - Apr 26 , 2024 | 12:01 AM

పెద్దాపురం, ఏప్రిల్‌ 25: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బూత్‌ కమిటీలు, కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక సుధాకాలనీలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఆయన కార్యకర్తలు, బూత్‌ కమిటీలతో సమావేశమయ్యారు, వచ్చే ఎన్నికల్లో ఏవిధంగా పనిచేయాలి, ఎలా ముందుకు సా గాలి అనే విషయాలపై కార్యకర్తలో చర్చించారు. ఈ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త ఎంతగానో శ్ర

పెద్దాపురంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న చినరాజప్ప,

ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

కార్యకర్తలు, బూత్‌ కమిటీలతో సమావేశం

పెద్దాపురం, ఏప్రిల్‌ 25: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బూత్‌ కమిటీలు, కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక సుధాకాలనీలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఆయన కార్యకర్తలు, బూత్‌ కమిటీలతో సమావేశమయ్యారు, వచ్చే ఎన్నికల్లో ఏవిధంగా పనిచేయాలి, ఎలా ముందుకు సా గాలి అనే విషయాలపై కార్యకర్తలో చర్చించారు. ఈ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త ఎంతగానో శ్రమించాలన్నారు. పార్టీ విజయానికి ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. ముఖ్యంగా బూత్‌ కమిటీలు మరింత సమర్థవంతగా పనిచేయాలని పిలుపుని చ్చారు. భావితరాల భవిష్యత్తు బాగుపడాలంటే టీడీపీకి ఓటు వేయాలన్నారు. ఐదేళ్ల వైసీపీ కాలంలో అభివృద్ది ఏమీలేద న్నారు. బూత్‌ కన్వీనర్లు సైనికుల్లా పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతానికి విజయానికి బూత్‌ కమిటీలే కీలకమన్నారు. అలాగే వైసీపీ వైఫల్యాలను వివరించాలని, సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజాసూరిబాబురాజు, ఎలిశెట్టి నాని, కర్రి వెంకటరమణ, బడుగు శ్రీకాంత్‌, కందుల విశ్వేశ్వరరావు, మొయిళ్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:01 AM

Advertising
Advertising