ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శాంతి భద్రతలు.. మహిళా రక్షణ మా ధ్యేయం

ABN, Publish Date - Jul 31 , 2024 | 01:56 AM

రాజమహేంద్రవరంలో బ్లేడ్‌ ,గంజాయి బ్యాచ్‌ అనే పదాలు వినబడకుండా పోలీస్‌ ,ఇతర శాఖల సమన్వయంతో పూర్తిగా అరికడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు.

  • మీ భద్రత.. మా భాధ్యతలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం సిటీ, జూలై 30 : రాజమహేంద్రవరంలో బ్లేడ్‌ ,గంజాయి బ్యాచ్‌ అనే పదాలు వినబడకుండా పోలీస్‌ ,ఇతర శాఖల సమన్వయంతో పూర్తిగా అరికడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. 46వ డివిజన్‌లో మంగళవారం జరిగిన మీ భద్రత..మా బాధ్యతలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2019-24 మధ్య రాజమహేంద్రవరంలో బ్లేడ్‌ బ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లు పెరిగిపోయాయని వాటిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు కృషి చేస్తున్నామన్నా రు. మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చేర్యలు చేపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి, నాయకులు అగురు ధనరాజు, మొకమాటి సత్యనారాయణ, కొయ్యల రమణ, తురకల నిర్మల, మండల రవి, పిడిమి ప్రకాష్‌, కేబుల్‌ మురళీ పాల్గొన్నారు.

విద్యార్థులకు పుస్తకాలు అందజేత

ఒకటో డివిజన్‌లో కేర్‌ ఫర్‌ ఆల్‌వెల్ఫేర్‌ సొసైటి చైర్మన్‌ పాస్టర్‌ డి.కోటేశ్వరరావు ,దేవామణి పర్యవేక్షణలో, సొసైటీ, క్రైస్ట్‌చర్చ్‌ సంయుక్త ఆధ్వ ర్యంలో పేద విద్యార్థులకు మంగళవారం పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకిరామయ్య, మాజీ కార్పొరేటర్‌ కడలి రామకృష్ణ, కమిటీ సభ్యులు మారిశెట్టి నరసింహమూర్తి, డి.లక్ష్మణరావు, పి.దేవానంద్‌, కె.శ్యామ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 08:02 AM

Advertising
Advertising
<