పంటపొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
ABN, Publish Date - Jul 25 , 2024 | 01:26 AM
అధిక వర్షాల వల్లన వరిపంటకు జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు వ్యవసాయ అధికారులు బుధవారం రూరల్‌లో తొర్రేడు, కోలమూరు. కాతేరు, హుక్కుంపేట, బొమ్మూరు, ధవళేశ్వరం గ్రామాల్లో పర్యటించారు.
1260 ఎకరాల పంట నష్టం
రాజమహేంద్రవరం రూరల్, జూలై 24: అధిక వర్షాల వల్లన వరిపంటకు జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు వ్యవసాయ అధికారులు బుధవారం రూరల్‌లో తొర్రేడు, కోలమూరు. కాతేరు, హుక్కుంపేట, బొమ్మూరు, ధవళేశ్వరం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా రైతులతో చర్చించి పంటలను పరిశీలించారు. జల్లకాలువ ప్రభావంతో తొర్రేడు గ్రామంలో 440 ఎకరాలు, కోలమూరులో 257 ఎకరాలు, కాతేరులో 442 ఎకరాలు కలిపి మొత్తం 1139 ఎకరాలు రైతులు నష్టపోయారని అంచనవేసారు. అదేవిధం దవళేశ్వరం ఆవకాలువ వల్లన హుక్కుంపేటలో 50 ఎకరాలు, బొమ్మూరులో 50 ఎకరాలు, ధవళేశ్వరంలో 21 ఎకరాలు కలిపి మొత్తం 121 ఎఝరాలు నష్టపోయినట్లు నిర్ధారించారు. పిలక దశలో పంటనీట మునిగితే పూర్తిగా బయటకు తీసివేసి పైపాటుగా ఎఝరానికి 20 కిలోల యూరియా,20 కిలోల మ్యూరేట్‌ఆఫ్ పొటాష్ అదనంగా వేసుకోవాలని , ఈ విధంగా బూస్టర్ డోస్ వేసుకోవడం వలన మొక్క ముంపుప్రభావం నుంచి త్వరగా కోలుకుంటుందని , మొక్క కోలుకున్న తర్వాత కుళ్ళు తెగుళ్ళు రాకుండా లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం కలిపి పిచికారీ చేయాలని సూచించారు. రైతులు గోదావరి ఎడమగట్టు అవుట్ ఫాల్ స్లూయిస్ 13 కిమీ కాతరు వద్ద జల్లకాలువ ప్లాప్ గేట్లు పాడైపోయాయని దిని వల్లన గోదావరి వరద ఉదృతి పెరిగిన వరద నీరు కాలువలోకి వచ్చి జల్లకాలువ పరివాహక ప్రాంతమంతా కాతేరు. కోలమూరు, తొర్రేడు గ్రామాలలో వరిపంట నీటమునిగి పంట దెబ్బతినడం జరిగిందని దినికి శాస్వత ప్రాతిపధికన ధ్వారా ప్లాప్ గేట్లు 3 బాగుచేయించి, కాలువ ఆక్రమణలు తొలగించి, పూడిక తీయించి లిప్ట్ విధానం ద్వారా జల్లకాలువ నుంచి గోదావరిలోకి నీరు ఎత్తిపోసేవిధంగా ఏర్పాట్లు చేయాలని రైతాంగం అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2024 | 08:42 AM