ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కార్యాలయాలకు కొత్త కళ

ABN, Publish Date - Jun 12 , 2024 | 01:03 AM

విభజిత ఆంధ్రప్రదేశ్‌ 3వ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేస్తు న్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు విద్యు ద్దీపాలంకరణ చేశారు. విజయవాడలోని కేసరపల్లి జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్ర మం వేడుకగా నిర్వహిస్తున్నారు.

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం

  • ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు విద్యుద్దీపాలంకరణ

  • కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి అధికారుల ఏర్పాట్లు

  • కల్యాణ మండపాలు, కళావేదికల వద్ద భారీ స్ర్కీన్లు

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 11: విభజిత ఆంధ్రప్రదేశ్‌ 3వ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేస్తు న్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు విద్యు ద్దీపాలంకరణ చేశారు. విజయవాడలోని కేసరపల్లి జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్ర మం వేడుకగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ కార్యాలయం, ఆర్ట్స్‌కళాశాల, పుష్కరాలఘాట్‌ రోడ్డులోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయానికి విద్యుద్దీపాలను అలంకరించి ఫోకస్‌ లైట్లు అమర్చారు. నూతన ప్రభుత్వానికి ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అప్పటి నుంచి అన్ని ప్రభుత్వ శాఖలలో నూతన ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుతో అటు ప్రజలు, ఇటు కూటమి నాయకులు, ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని ప్రజానీకం తిలకించేందుకు రాజమహేంద్రవరంలో పలు చోట్లు ఎల్‌ఈడీ స్ర్కీన్స్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - Jun 12 , 2024 | 01:03 AM

Advertising
Advertising