పనులన్నీ..పెండింగే!
ABN, Publish Date - Jul 15 , 2024 | 12:44 AM
గత వైసీపీ ప్రభుత్వం పనులన్నీ ఒట్టి డొల్ల. అన్ని ప్రగ ల్భాలే. ఆరంభ శూరత్వం తప్ప.. అమలు శూన్యం. ఎక్కడి పనులు అక్కడే. రూ.కోట్లు నిధులు ఇస్తున్నట్టు చెప్పి..పనులు ఆరంభించి ఎవరికీ నిధులు ఇవ్వకుండా.. చేసిన పనులకు బిల్లులూ చెల్లించకుండా అందరినీ ముంచేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది.
జలజీవన్ మిషనూ ఆగిపోయే..
పేదల కాలనీల పనులూ సాగలేదు
గడపగడపకూ ...పెండింగే
సీఎం డీఎఫ్ పనులూ అంతే
అంచనాల్లో ఉపాధి పనులు
రూ.27.51 కోట్లు పెండింగ్
బిల్లులందక వైసీపీ నేతల గగ్గోలు
260 మంది లబోదిబో
(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వం పనులన్నీ ఒట్టి డొల్ల. అన్ని ప్రగ ల్భాలే. ఆరంభ శూరత్వం తప్ప.. అమలు శూన్యం. ఎక్కడి పనులు అక్కడే. రూ.కోట్లు నిధులు ఇస్తున్నట్టు చెప్పి..పనులు ఆరంభించి ఎవరికీ నిధులు ఇవ్వకుండా.. చేసిన పనులకు బిల్లులూ చెల్లించకుండా అందరినీ ముంచేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది. కేవలం ఒక గ్రామీణ మంచి నీటి సరఫరా వ్యవస్థ (ఆర్‌డబ్ల్యూఎస్) ద్వారా జిల్లాలో అనేక పనులకు అంచనాలు వేయించి చివరకు తుస్ మనిపిం చారు..దీంతో వైసీపీ అధినేత జగన్‌ను నమ్ముకున్నవారే నట్టేట మునిగారు. జిల్లాలో మొత్తం వివిధ గ్రాంట్లు కింద 3303 పనులకు రూ.764.14 కోట్లతో అంచనా వేసి కేవలం రూ.104.63 కోట్లు విలువైన పనులు మాత్రమే చేయించారు. రూ. 27.51 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా 227 పనులు వివిధ దశల్లో ఆగిపోగా, నిధుల లేమితో 1412 పనులు అసలు ఆరంభించలేదు. ఇలా నాడు సీఎం జగన్ మాట తప్పాడు.. మడమ తిప్పాడు..
వైసీపీ నాయకులు లబోదిబో..
జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎం డెవలప్‌మెంట్ ఫండ్ పేరిట నిధులిస్తామని.. ప్రతి నియోజకవర్గంలోనూ పనులు చేయాలని చెప్పడంతో రూ.5లక్షల లోపు పనులు ఆరంభిం చారు. అయితే పనులు సాగుతున్నా డబ్బులు రాకపోవడంతో పలువురు వైసీపీ సర్పంచ్‌లు, పలువురు వైసీపీ చోటా నాయ కులు ఇవాళ లబోదిబోమంటున్నారు. జగన్ మాటలు నమ్మి ఇరుక్కుపోయిన వైసీపీ చోటా లీడర్లు జిల్లాలో సుమారు 260 మంది వరకూ ఉన్నట్టు అంచనా. గడపగడపకూ వైసీపీ నేతలు ఇచ్చిన హామీలతో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉండడం గమనార్హం. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో ఆయా నాయకుల పరిస్థితి అయోమయంగా ఉంది. తమ బిల్లులు సెటిల్ చేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఎలాగోలా తమ ను గట్టెక్కించాలని వేడుకుంటున్నారు. కానీ అధికారులు ఏమీ చేయలేక.. ఏదో సర్దిచెప్పి పంపించేస్తున్నారు.
సీఎం నిధులకే దిక్కులేదు..
సీఎం డెవలప్‌మెంట్ ఫండ్ పేరిట జిల్లా లో 81 పనులకు రూ. 4.79 కోట్లతో అర్జంట్‌గా అంచనాలు వేయించారు. రూ.5లక్షలలోపు పనులన్నీ నామినేషన్ విధానం లో చేయి స్తామని అప్పటి ఎమ్మెల్యేలు చెప్పారు.వైసీపీ కార్యక ర్తలు కొందరు ముందుకు వచ్చి పనులు మొదలు పెట్టారు. 29 ఆరంభించి 28 పూర్తి చేశారు.రూ.71.94 లక్షలు బిల్లులి వ్వలేదు.మిగతా 52 పనులు చేయలేదు. ప్రస్తు తం చేసిన పనులకు డబ్బులందక గిజగిజలాడిపోతున్నారు.
గడపగడపకూ నిధులకు నీరసం..
వైసీపీ చివరి రెండేళ్లలో మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలం దరినీ గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట ప్రజల వద్దకు పంపింది. దీనిలో భాగంగా వైసీపీ జిల్లాలో 1263 పనులకు హామీ ఇచ్చింది.ఆయా పనులకు రూ.43.58 కోట్లు ఖ ర్చ వు తుందని అంచనా వేసింది. అయితే గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వైసీపీకి చెందిన చోటా నాయకులే కాంట్రాక్టర్ల అవతారమెత్తారు.వారితో చిన్న డ్రైన్లు పనులు 820 చేయించారు. 26 పనులు ఆరంభించారు. మరో 417 పనులు ఆరంభించలేదు. చేసిన పనులకు రూ. 18.29 కోట్లు ఖర్చయింది. అందులో ఇంకా రూ. 7.38 కోట్ల బిల్లులు చెల్లిం చలేదు.దీంతో సదరు వైసీపీ లీడర్లు లబోదిబోమంటున్నారు.
జీవం పోయిన జలజీవన్..
జిల్లాలో జలజీవన్ మిషన్ ద్వారా అనేక పనులు చేయాలని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబం ధించిన ఈ పఽథకం గతంలో టీడీపీ ప్రభుత్వం ఉండగా మంజూరైంది. అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ వాటర్ గ్రిడ్‌తో గోదావరి నీటిని ఇంటింటికీ సరఫరా చేయాలని ప్రయత్నించారు. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ డిజైన్లను, అంచనాలు అస్తవ్యస్తం చేసింది. చివరకు రూ. 489 కోట్ల అంచనాతో 670 పనులు చేయ డానికి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అంచనాలు సిద్ధం చేశా రు.ప్రతి గ్రామంలోని మంచినీటి వ్యవస్థను మెరుగుపర చడం పనుల లక్ష్యం.. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం. పైపులైన్లు నిర్మించడం, ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వడం వంటి పనులు ఇందులో ఉన్నాయి. కానీ చచ్చీచెడి రూ.355 పనులు చేశారు.మరో 84 ప్రారంభించారు. 231 పనుల ప్రారంభించలేదు. కానీ చేసిన వాటికి రూ.59.55 కోట్లు బిల్లు లు చెల్లించాల్సి ఉండగా కొంతమాత్రమే చెల్లించారు. ఇంకా రూ.11.56 కోట్లు బిల్లులు చెల్లించలేదు. దీంతో ప్రారంభించిన పనులతో పాటు మిగతా 231 పనులు ఆగిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు, బినామీలతో పనుల్లోకి దిగిన వైసీ పీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. పేదలందరికీ ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జలజీవన్ మిషన్‌కు చెందిన రూ. 176.66 కోట్లతో 376 కాలనీల్లో 497 పనులకు అంచ నాలు వేశారు. కేవలం 72 పనులు ఆరంభించి 70 చేశారు. రూ.19.20 కోట్ల బిల్లులు ఇవ్వవలసి ఉండగా కొంత మాత్రమే ఇచ్చారు. ఇంకా రూ.5.69 కోట్లు పెండింగ్ ఉంది. మిగతా 425 పనులు ఆగిపోయాయి.చేసిన వాటికీ పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. మిగతా కాలనీల్లో చేయవలసిన పనులూ చేయలేదు. వెలు గుబంద కాలనీలో ఓహెచ్‌ఆర్ నిర్మా ణం మధ్యలోనే ఆగిపో యింది.మంచినీటి సరఫరాకు చెం దిన సీపీ డబ్ల్యూఎస్ ఎస్‌కు సంబంధించి ఆపరేషన్ అండ్ మెయింట్ నెన్స్‌కు గత మూడేళ్లగా పైసా ఇవ్వలేదు. దీని ద్వారా లక్షల మందికి మంచినీటి సరఫరా జరుగుతోంది. పురుషోత్తపట్నం, కడి యం,సీతానగరం, తాళ్లపూడి, రంగపేట మండలాల్లో ఈ పథకాలు ఉన్నాయి.కొత్తగా 6 పనులకు రూ. 10.89 కోట్లతో అంచనా వేసి పనులు ప్రారంభించినా ఒక పైసా కూడా నిధులు రాక ఏదీ పూర్తికాలేదు. 2020-21, 20223-24కు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.23.74 కోట్లు పెండింగ్ ఉంది. దీంతో వీటి నిర్వహణ కష్టమైపోతోంది.
డీఎంఎఫ్ పట్టించుకోలేదు..
జిల్లాలో ఇసుక, ఇతర గనుల నుంచి జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) ఉంటుంది. ఇసుక అమ్మకాలు, ఇతర మిన రల్స్ అమ్మకాల్లో కొంత శాతం ఫండ్‌కు కేటాయించాలి. దీంతో గ్రామాల్లో డ్రైన్ల వంటివి నిర్మించాలి. వైసీపీ ఐదేళ్లలో డీఎంఎఫ్ గురించే పట్టించుకోలేదు. అప్పటికే ఉన్న సొమ్ముతో రూ. 8.15 కోట్లతో 151 పనులకు అంచనాలు వేశారు. 43 పనులు ప్రారంభించి కేవలం 35 పూర్తిచేశారు. వాటికే రూ.కోటి బకాయి ఉండడంతో మిగతా 103 పనులు అసలు మొదలు పెట్టలేదు. 13 పనులు ఆగిపోయాయి.
ఉపాధి పనులు హుళక్కే..
ఎంజీఎన్‌ఆర్ ఈజీఎస్(ఉపాధిహామీ) పథకం కింద రూ. 19.29 కోట్లతో 243 పనులకు అంచనా వేశారు. వీటితో గ్రామాల్లో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మించాలి. 71 పనులు ప్రారంభించగా 25 పూర్తి చేశారు. దానికి సంబంధించి రూ.64.36 లక్షల బిల్లులు ఇవ్వకపోవడంతో 46 పనుల మధ్యలో ఆగిపోయాయి. 172 పనులను అసలు ఆరంభించ కుండానే వదిలేశారు. సచివాలయాల టాయిలెట్స్ నిర్మాణానికి రూ.11.76 కోట్ల తో 392 పనులు అంచనాలు వేసి 331 పూర్తి చేశారు.ఇంకా 49 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 12 పనులు మొదలు పెట్టలేదు.ఇందులో చేసిన పనులకు ఇంకా రూ.53.76 లక్షలు బిల్లులు చెల్లించాల్సి ఉంది.
Updated Date - Jul 15 , 2024 | 12:44 AM