మంత్రిగారొచ్చారు.. సమస్య చూశారు!
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:59 AM
హంగూ లేదూ.. ఆర్భాటం లేదు..ముందస్తు షెడ్యూలు లేదు.. మంత్రి గారు వచ్చే శారు..ఇది విన్న గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఎందుకొచ్చారోనంటూ వెంటనే మంత్రి వద్దకు పరుగులు తీశారు.
పెరవలి, జూలై 30 : హంగూ లేదూ.. ఆర్భాటం లేదు..ముందస్తు షెడ్యూలు లేదు.. మంత్రి గారు వచ్చే శారు..ఇది విన్న గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఎందుకొచ్చారోనంటూ వెంటనే మంత్రి వద్దకు పరుగులు తీశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం పెరవలి మండలం కాపవరం గ్రామంలో జరిగింది. గతంలో తమ గ్రామం వద్ద గల కాలిబాట వంతెన శిథిలావస్థకు చేరిందని..మరమ్మతులు చేయించాలంటూ గ్రామస్థులు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయం అధికారులు మంత్రిదృష్టికి తీసుకువచ్చారు.అంతే అప్పటికపుడు బయ లుదేరి కాపవరం వచ్చారు.వంతెన అంతా పరిశీలించారు. అయితే గ్రామస్థులు తమకు పెద్ద వంతెన వేయాలని కోరారు. అది రావాలంటే పెద్ద బడ్జెట్ అని ఇరువైపులా రోడ్లు సక్రమంగా ఉండాలని అందువల్ల కాలువ అవతలి వైపు రోడ్డు పనులు ముందుగా చేయాలని అధికారులను ఆదేశించారు.కాపవరం కాలువగట్టు నుంచి తణుకు వెళ్లే పుంత రోడ్డును పక్కా రోడ్డుగా మార్చమని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వంతెనకు మరమ్మతులు చేయిస్తామని భవిష్యత్తులో పెద్ద వంతెన విషయమై పరిశీలిస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశా రు. కాపవరం గ్రామం నుంచి కాలువ అవతల గల పొలాలకు వెళ్లాలన్నా తణుకు తదితర చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాలన్నా ఈ వంతెన ప్రధాన ఆధారం.
Updated Date - Jul 31 , 2024 | 12:59 AM