భూహక్కు చట్టం రద్దుపై న్యాయవాదుల హర్షం
ABN, Publish Date - Jun 15 , 2024 | 01:32 AM
సీఎం చంద్రబాబునాయుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేయడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
ముమ్మిడివరం, జూన్ 14: సీఎం చంద్రబాబునాయుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేయడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం న్యాయవాదుల సమావేశం జరిగింది. బార్ అసోసియేషన్ చాంబర్‌లో కేక్‌ను కట్‌చేసి వేడుకలు జరుపుకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రాజ్యాంగ వ్యతిరేక చట్టమని న్యాయవాదులు, మేధావులు రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలలు నుంచి అనేక ఉద్యమాలు, నిరసనలు, పోరాటాలు చేసినా గత ప్రభుత్వం లెక్క చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. న్యాయవాదులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ, నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు, సంక్షేమ నిధి పెంపు, న్యాయవాది గుమస్తాల సంక్షేమ, ఆర్థిక తోడ్పాలు వంటి పథకాలను నూతన ప్రభుత్వం అమలు చేయాలని సమావేశం కోరింది. సమావేశంలో మట్టపర్తి వెంకటేశ్వరరావు, రామాయణం మనేశ్వరరావు, గంటి శ్రీధర్‌బాబు, పలివెల నరేష్‌కుమార్, గోనమండ వెంకటేశ్వరరావు, జీవీవీ రామారావు, కేఎల్‌వీ ప్రసాదరావు, గుత్తుల శ్రీనివాసరావు, అయినవిల్లి వలియాబాబు, కుచ్చర్లపాటి తాతంరాజు, కేఆర్కే రాజు, రెడ్డి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
Updated Date - Jun 15 , 2024 | 01:32 AM