‘క్రియ’ అదిరింది!
ABN, Publish Date - Dec 30 , 2024 | 12:32 AM
సర్పవరంజంక్షన్, డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): కాకినాడలో నిర్వహిస్తున్న క్రియ పిల్లల పండుగ అంబరాన్నంటింది. రెండురోజులపాటు జరిగిన పోటీల్లో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో పా ల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో సాంస్కృతిక నృత్యప్రదర్శనలు, మైమరిపించే కోలాట నృ త్యాలు, అబ్బురపరిచే రీతిలో
ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
రెండోరోజూ ప్రతిభకు పట్టాభిషేకం
ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు
ముగిసిన రాష్ట్రస్థాయి క్రియ అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీలు
సర్పవరంజంక్షన్, డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): కాకినాడలో నిర్వహిస్తున్న క్రియ పిల్లల పండుగ అంబరాన్నంటింది. రెండురోజులపాటు జరిగిన పోటీల్లో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో పా ల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో సాంస్కృతిక నృత్యప్రదర్శనలు, మైమరిపించే కోలాట నృ త్యాలు, అబ్బురపరిచే రీతిలో ఆకట్టుకునేలా చిన్నారులు గీసిన పెయింటింగ్స్‌తో ఆకట్టుకున్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో రెం డురోజులుగానిర్వహిస్తున్న 11వ రాష్ట్రస్థాయి క్రియ అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీలు ఘనంగా ముగిశా యి. ముగింపు పోటీలో లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. సైన్స్ ఫేర్, చిత్రలేఖనం, సాంస్కృతిక నృత్యాలు, క్విజ్ పోటీలను స్వయం వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులకు విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. రెండోరోజు కార్యక్రమంలో భాగంగా జానపద నృత్యం (బృందం) విచిత్ర వేషధారణ(ఫ్యాన్సీ డ్రెస్), బు ర్ర కథ, కోలాటం, ప్రాజెక్టు పని, వాద్య సంగీతం, మాటలు, కథ చెప్పడం, స్పెల్లింగ్, చిత్రలేఖనం, సృజనాత్మక వస్తువుల తయారీ, మైమ్, మట్టితో బొమ్మలు తదిర అంశాల్లో పోటీలు జరిగాయి. 5వ తరగతి వరకు సబ్ జూనియర్స్, 6, 7 తరగతులకు జూనియర్స్, 8,9,10 తరగతి విద్యార్థు లు సీనియర్స్ విభాగంలో రెండురోజులపాటు పో టీలు జరిగాయి. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీ యస్థానాలు సాధించిన విజేతలకు బహుమతు లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణాకు చెందిన 350 పాఠశాలలకు చెందిన 11వేలమంది విద్యార్థులు, తల్లిదండ్రు లు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమం లో సంస్థ కార్యదర్శి ఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథరాజు, డాక్టర్ కాద వెంకటరమణ, చుండ్రు జానకీరామ్ ప్రసాద్, మాచిరాజు, అల్లూరి సురేంద్ర, బత్తుల గణేష్, శివ, కృష్ణంరాజు పాల్గొన్నారు. పోటీలకు ప్రాంగణం ఇచ్చిన జేఎన్‌టీయూ వీసీ, దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Dec 30 , 2024 | 12:32 AM