ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు : ఎస్పీ

ABN, Publish Date - Apr 06 , 2024 | 12:45 AM

అమలాపురం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ తెలిపారు. జిల్లాలోని జొన్నాడ, గోపాలపురం, బొబ్బర్లంక, దిండి, ఎదుర్లంక, నర్సాపురపు పేట చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ట్రైనీ

ఎదుర్లంక వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

అమలాపురం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ తెలిపారు. జిల్లాలోని జొన్నాడ, గోపాలపురం, బొబ్బర్లంక, దిండి, ఎదుర్లంక, నర్సాపురపు పేట చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ట్రైనీ డీఎస్పీ విష్ణుస్వరూప్‌ ఆధ్వర్యంలో సిబ్బంది జొన్నాడ చెక్‌పోస్టు వద్ద అమలాపురం డీఎస్పీ ఎం.మహేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఎదుర్లంక, అంతర్‌రాష్ట్ర ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం పి.గన్నవరం పరిధిలో పొదలాడ కెనాల్‌ రోడ్డులో ఎఫ్‌ఎస్టీ, జిల్లా పోలీసుల తనిఖీల్లో రూ.1.95 లక్షలు సీజ్‌ చేశామన్నారు. ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 365 డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ బాటిళ్లను, 67.5 లీటర్ల ఐఎంఎల్‌, 24 ఎన్‌డీపీ లిక్కర్‌ బాటిళ్లు, 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఏడు కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ నెల 4న జొన్నాడ చెక్‌పోస్టు వద్ద రూ.1.98 లక్షలు సీజ్‌ చేసినట్టు తెలిపారు.

Updated Date - Apr 06 , 2024 | 12:45 AM

Advertising
Advertising