ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాపులకు సీఎం జగన్‌ అన్యాయం చేశారు

ABN, Publish Date - Apr 20 , 2024 | 01:00 AM

సీఎం జగన్‌ కాపులకు తీరని ద్రోహం చేశారని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ అన్నారు. శుక్రవారంరామచంద్రపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

రామచంద్రపురం, ఏప్రిల్‌ 19: సీఎం జగన్‌ కాపులకు తీరని ద్రోహం చేశారని కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ అన్నారు. శుక్రవారంరామచంద్రపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని, కాపులకు ఈబీసీ కోటాలో టీడీపీ కేటాయించిన 5శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా జగన్‌ తీరని ద్రోహం చేశారన్నారు. కాపులను సామాజికంగా, ఆర్థికంగా బలహీనపరచాలని దురుద్దేశంతో రిజర్వేషన్లు అమలు చేయలేదన్నారు. ఆరేటి శ్రీకృష్ణ మాట్లాడుతూ కాపుసామాజికవర్గానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు, కన్నెగంటి హనుమంతు వంటి ప్రముఖులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో నూతన జిల్లాలకు ఒక్కరిపేరుకూడా పెట్టలేదన్నారు. సమావేశంలో టీడీపీ కాపు నాయకులు రేవు శ్రీను, అక్కల రిష్యంత్‌రాయ్‌, చింతపల్లి అర్జున్‌, చింతపల్లి వీరభద్రరావు, దామిశెట్టి గంగాపురుషోత్తం, నారపురెడ్డి బలరాం పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:00 AM

Advertising
Advertising