ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి’

ABN, Publish Date - May 12 , 2024 | 11:49 PM

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 12: ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జె.వెంకటరావు తెలిపారు. స్థానిక మెక్లారిన్‌ గ్రౌండ్స్‌లోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని, జేఎన్టీయూకే ఆవరణలోని రిసెప్షన్‌ సెంటర్లను ఆదివారం ఆయన సందర్శిం

పోలింగ్‌ సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఆర్వో

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 12: ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జె.వెంకటరావు తెలిపారు. స్థానిక మెక్లారిన్‌ గ్రౌండ్స్‌లోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని, జేఎన్టీయూకే ఆవరణలోని రిసెప్షన్‌ సెంటర్లను ఆదివారం ఆయన సందర్శించారు. కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో 234 పోలింగ్‌స్టేషన్లలో సోమవారం పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగే పోలింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలింగ్‌ సరళిని ప్రతి రెండు గంటలకొకసారి వెల్లడిస్తామన్నారు. 22మంది సె క్టార్‌ ఆఫీసర్లు, మరో 22మంది రూట్‌ ఆఫీసర్లు పోలింగ్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు. 1700మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నారన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో 40 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, నియోజకవర్గ పరిధిలో 2,41,620 ఓటర్లు ఉన్నారన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సోమవారం పోలింగ్‌ పూర్తయిన వెంటనే ఈవీఎం, వీవీ ప్యాట్లతోపాటు ఇతర ఎన్నికల సామాగ్రిని జేఎన్టీయూకే ఆవరణలోని సివిల్‌ బ్లాక్‌లో భద్రపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - May 12 , 2024 | 11:49 PM

Advertising
Advertising