ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిరు ధాన్యాల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు

ABN, Publish Date - Jul 05 , 2024 | 12:11 AM

పెద్దాపురం, జూలై 4: ప్రభుత్వం చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.విజయకుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని వాలుతిమ్మాపురంలో భారత ప్రభుత్వం చిరుధాన్యాల సాగుకు ఇస్తున్న ప్రోత్సాహకంలో భాగంగా రైతులతో క్షేత్రస్థా

డీఏవో విజయకుమార్‌

పెద్దాపురం, జూలై 4: ప్రభుత్వం చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.విజయకుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని వాలుతిమ్మాపురంలో భారత ప్రభుత్వం చిరుధాన్యాల సాగుకు ఇస్తున్న ప్రోత్సాహకంలో భాగంగా రైతులతో క్షేత్రస్థాయి అవగాహనా సదస్సు నిర్వహించారు. గతంలో కరపెండలం దుంపసాగు చేసిన రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. మెట్ట ప్రాంతంలో వాతావరణం రాగులు వంటి చిరుధాన్యాల పంటలకు అనుకూలమన్నారు. రైతులు ప్రయోగాత్మకంగా జూలై నెలాఖరులోపు ఎకరానికి 3 కిలోల చొప్పున రాగులు విత్తనాలు వేసుకున్నట్లైతే 120 రోజుల పంట కాలం తర్వాత ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ళ దిగుబడు లు వస్తుందని డీఏవో తెలిపారు. డీడీఏ శ్రీహరి మాట్లాడుతూ మెట్టలో కరపెండలం పంటకు ప్రత్యా మ్నాయంగా చిరుధాన్యాలు వేసి రైతులు మంచి లాభాలు ఆర్జించవచ్చన్నారు. గెడ్డం ఏసుబాబు, బూసి శ్రీను, పితాని వీరభద్రరావు, భీమరాజు, ఏడీఏ మాధ వి, ఎన్‌.దైవకుమార్‌, కె.సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:11 AM

Advertising
Advertising