పీవోలు, ఏపీవోలకు శిక్షణ కీలకం
ABN, Publish Date - Apr 13 , 2024 | 12:30 AM
జగ్గంపేట, ఏప్రిల్ 12: ఆర్వోల ఆధ్వర్యంలో పీవోలు, ఏపీవోలకు నిర్వహిస్తున్న శిక్షణ చాలా కీలకమైందని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జగ్గంపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో జగ్గంపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2రోజులు పాటు పోలింగ్ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా తరగతులను శుక్రవారం కలెక్టర్ పరిశీ లించారు. పీవో, ఏపీవోలకు అందిస్తున్న శిక్షణ పట్ల పలు వివరాలు క్షుణ్ణం
జిల్లా కలెక్టర్ నివాస్
జగ్గంపేట, ఏప్రిల్ 12: ఆర్వోల ఆధ్వర్యంలో పీవోలు, ఏపీవోలకు నిర్వహిస్తున్న శిక్షణ చాలా కీలకమైందని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జగ్గంపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో జగ్గంపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2రోజులు పాటు పోలింగ్ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా తరగతులను శుక్రవారం కలెక్టర్ పరిశీ లించారు. పీవో, ఏపీవోలకు అందిస్తున్న శిక్షణ పట్ల పలు వివరాలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మాస్టర్ ట్రైనీస్‌ని నియమించి ప్రతి ఒక్కక్లాస్‌రూమ్‌కి 30 మంది చొప్పున ఈ వీఎం మిషన్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నార న్నారు. ఈవీఎంని ఏ విధంగా వాడాలి, ఏ విధ ంగా పని చేస్తుంది, వాటిలో తాత్కాలిక సమస్యలు తలెత్తితే ఎలా పరిష్కరించాలితోపా టు వారు ఇవ్వాల్సిన ఫామ్స్‌పై వివరించారు. అంతకముందు ప్రభుత్వ డిగ్రీకళాశాల నందు ఆర్వో ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగ్గంపేట లో 4మండలాలకు సంబంధించిన తహశీల్దార్ల ఆధ్వర్యంలో బూత్ ఆఫీసర్లకు ఈవీఎంలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అధికారులతో పాటు సిబ్బందికి సలహాలు ఇచ్చారు.
Updated Date - Apr 13 , 2024 | 12:30 AM