వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన అభివృద్ధి
ABN, Publish Date - Jun 20 , 2024 | 12:07 AM
కాకినాడ సిటి, జూన్ 19: గత వైసీపీ ప్రభు త్వంలో గాడి తప్పిన కాకినాడ నగర అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్టు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి సంజీవనగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ జనావాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి
కాకినాడ సిటి, జూన్ 19: గత వైసీపీ ప్రభు త్వంలో గాడి తప్పిన కాకినాడ నగర అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్టు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి సంజీవనగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ జనావాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరానికి దూరంగా ఎన్‌ఎఫ్‌సీఎల్ సంస్థకు చెందిన 20 ఎకరాల భూమిని సేకరిం చి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ రూపకల్ప నకు ప్రతిపాదనలు చేయగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తన అక్రమ సంపాదనకు జనావాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని గంజాయి, డ్రగ్స్ అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించడానికి అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారన్నారు. ఈ ప్రాంతం లో అధికసంఖ్యలో లారీలు ఎగుమతి, దిగుమ తులకు సంబంధించి ఎక్కువ భాగం కార్యకలా పాలు సాగిస్తున్నాయన్నారు. ఈ రోడ్డును డంపి ంగ్ యార్డ్ నుంచి కాకినాడ పాత రైల్వేస్టేషన్ వ రకు తక్షణం పునరుద్ధరించే ప్రయత్నం చేయా లని మున్సిపల్ అధికారులను ఆదేశించామ న్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు, పోర్టు సీఐ సుమంత్, టీడీపీ కాకి నాడ నగర అధ్యక్షుడు వీరు, బాలాజీ, సాయి బాబా, అశోక్, రాజు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2024 | 12:07 AM