ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్‌రెడ్డి నాటకాలు ప్రజలు నమ్మరు

ABN, Publish Date - Apr 16 , 2024 | 02:10 AM

ప్రజలను ఇంకా మోసం చేయాలని జగన్‌రెడ్డి చేసే సానుభూతి ప్రయత్నాలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.

ఓటమి భయంతోనే గులకరాయి దాడి చేయించుకున్న జగన్‌

రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల

రాజమహేంద్రవరంసిటీ/ రూరల్‌, ఏప్రిల్‌15: ప్రజలను ఇంకా మోసం చేయాలని జగన్‌రెడ్డి చేసే సానుభూతి ప్రయత్నాలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో సోమవా రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల సమయంలో తన అభిమానితో కోడికత్తి దాడి డ్రామాలు ఆడిన జగన్‌ సానుభూతి పొందాడన్నారు. ఈ ఐదేళ్లకాలంలో అసమర్థపాలనతో ప్రజల చీత్కారం ఎదుర్కొంటున్న జగన్‌ మళ్లీ సింపతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. వైసీపీ బస్సు యాత్రలో ఆ పార్టీ సామాజిక మాధ్యమాల విభాగాన్ని నడిపించే వారిలో ఒకరైన శ్రీధర్‌రెడ్డి నాలుగురోజుల కిందటే సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో తీవ్రమైన సంఘటనలు జరగొచ్చని పోస్టు చేశారని, దాని అంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఈ జగన్నాటకమన్నారు. జగన్‌కు ఎవరు సలహా ఇస్తున్నారోకానీ అవి పనికిరానివన్నారు. జగన్‌పై దాడి జరిగినప్పుడు పోలీసులు గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. డీజీపీని వెంటనే సస్పెండ్‌ చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఆగిందన్నారు. సంక్షేమం ముసుగులో జగన్‌ రాష్ట్రాన్ని దోచేశాడన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగా లు లేవన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు కేంద్రంగా రాష్ట్రాన్ని జగన్‌ మా ర్చేశాడన్నారు. రాబోయే తరాలను తాకట్టుపెట్టే అధికారం జగన్‌కు ఎవరిచ్చా రని, ఈ అప్పులు ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని కనుక ప్రతిపక్షాలు అన్నీ ఏకమయ్యాయని, నాశనమైన రాష్ట్రాన్ని భారీ మరమ్మతులు చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. జగన్‌ కుట్రలు చేసినా సింపతి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు అతన్ని నమ్మరని, కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుని అధికారంలోకి రాబోతోందని చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్‌ అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్‌, రూరల్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు బత్తిన ఏడుకొండలు, పల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 07:36 AM

Advertising
Advertising