ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:49 AM

నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని ఆయన ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణారావులతో కలిసి ఆదివారం ప్రా రంభించి, నీటిని విడుదల చేశారు.

కుమారదేవం ప్రాజెక్టును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి, ద్విసభ్య కమిటీ

  • ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

  • కుమారదేవం ఎత్తిపోతల పథకం ప్రారంభం

కొవ్వూరు, జూన్‌ 16: నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని ఆయన ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణారావులతో కలిసి ఆదివారం ప్రా రంభించి, నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రం బాగుంటునే ప్రజలు బాగుంటారని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని అన్నారు. పోలవరం ప్రా జెక్టుకు అంజయ్య సమయం నుంచి కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు. తప్ప దాని ప్రారంబించి ముందుకు తీసుకెళ్లినవారు ఎవ్వరూ లేరన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 72శాతం పూర్తిచేసిన పోలవరం ప్రాజెక్టు.. 30శాతం పూర్తిచేసి వారి పేర్లు వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. సోమవారాన్ని పోలవరంగా పెట్టుకుని పనిచేస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటగా సోమవారం పోలవరం వస్తున్నారన్నారు. నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించినా రైతుల సమస్యలను గాలికి వదిలివేశారన్నారు. కు మారదేవం ఎత్తిపోతల పథకంలో మోటార్లు మొత్తం మరమ్మతులకు గురై రైతులు ఇబ్బందులు పాలయ్యారన్నారు. కుమారదేవం పంపింగ్‌ స్కీమ్‌ కింద కొవ్వూరు, ఆరికిరేవలు దొమ్మేరు, కుమారదేవం గ్రామాల్లో 4650ఎకరాల ఆయ కట్టు ఉన్నప్పటికీ 1600 ఎకరాలకు మాత్రమే నీరందుతోందని, ఒక్క పంపు వేయాలంటే రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. రైతు లు చెల్లించవలసిన నీటి తీరువా బకాయిలు చెల్లించి పంపింగ్‌ స్కీమ్‌ అభివృద్ధికి పాటుపడాలన్నారు. జిల్లా కలెక్టరును కలసి పంపుల మరమ్మతులకు నిదులు మంజూరు చేయాలని కోరతానన్నారు. నియోజకవర్గంలోని 5 సాగునీటి పథకాలకు ఎస్టి మేట్లు తయారుచేసి అందించాలని, సోమవారం లేదా అసెంబ్లీ సమావేశాల్లో గాని చంద్రబాబుకు అందజేస్తానన్నారు. ఏపీఎస్‌ఐడీసీ ఈఈ భాస్కరరెడ్డి మా ట్లాడుతూ కుమారదేవం ఎత్తిపోతల పథకం 1977లో మొట్టమొదటిగా నిర్మా ణం చేపట్టారని, 50 ఏళ్లు పైబడడంతో మోటార్లు మరమ్మతులకు గురయ్యాయని, గత ప్రభుత్వంలో రూ.2 కోట్లతో ఎస్టిమేట్లు తయారుచేసి అందిం చినా నిధులు మంజూరు కాకపోవండతో పనులు చేపట్టలేకపోయామన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు రైతులు నీటితీరువా బకాయిలు చెల్లించి పంపింగ్‌ స్కీమ్‌ నిర్వహణకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో వట్టికూటి వెంకటేశ్వరరావు, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని,సూర్యదేవర రంజిత్‌, ఎంపీపీ కాకర్ల నారాయుడు, నామాన పరమేశ్వరరావు, గొరిజాల సురేష్‌, పిక్కి నాగేంద్ర, కనిగంటి సాంబయ్య, పాలడుగుల లక్ష్మణరావు, మేకల శ్రీనివాసు, సుంకర సత్తిబాబు, నాయుడు వీర్రాజు, మంకెన వీర్రాజు, చావా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:49 AM

Advertising
Advertising