ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిమజ్జన ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు

ABN, Publish Date - Sep 10 , 2024 | 12:35 AM

జిల్లా లోని వినాయక నిమజ్జన ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ నరసింహ కిషోర్‌ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలను సోమవారం పరిశీ లించారు. ముందస్తు భద్రత ఏర్పాట్లలో భాగంగా క్రేన్లు, గజఈతగాళ్లు, లైఫ్‌ జాకెట్లు, పడవలను అందుబాటులో ఉంచామన్నారు.

కొవ్వూరు గోష్పాదక్షేతరంలో అధికారులకు సూచనలిస్తున్న ఎస్పీ

  • చవితి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేయొద్దు

  • అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

  • ఎస్పీ నరసింహ కిశోర్‌

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి)/కొవ్వూరు/నల్లజర్ల: జిల్లా లోని వినాయక నిమజ్జన ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ నరసింహ కిషోర్‌ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలను సోమవారం పరిశీ లించారు. ముందస్తు భద్రత ఏర్పాట్లలో భాగంగా క్రేన్లు, గజఈతగాళ్లు, లైఫ్‌ జాకెట్లు, పడవలను అందుబాటులో ఉంచామన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఊరేగింపు, నిజమజ్జనాల సమయంలో మద్యం సేవించడం, సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలిగించడం, ఆధ్యా త్మిక వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా ప్రవర్తిం చడం, అశ్లీల నృత్యాలు చేయించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు. గణేష్‌ ఉత్సవాలు, నిజమజ్జనాల నిర్వహణపై ఇప్పటికే మార్గ దర్శకాలు జారీ చేశామని, వాటిని కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిమ జ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను ఎస్పీ పర్యవేక్షించి మాట్లాడారు. నిమజ్జన కార్యక్రమాల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఐ విశ్వంకు సూచించారు. అనంతరం నల్లజర్ల పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులు పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. చవితి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని కొన్ని మండలాల్లో హిజ్రాలతో ఆశ్లీల నృత్యాలు వేస్తున్నట్టు సమాచారం వచ్చిందన్నారు.ఎవరైనా హిజ్రాలతో కాని మహిళలతో కాని నృత్యాలు నిర్వహించరాదన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవాలన్నారు. వర్షాలు ఎక్కువగా ఉన్నందున నిమజ్ఞన కార్యక్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు,స్పెషల్‌ ఫోర్స్‌తో మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నామన్నారు.ఆయన వెంట డీఎస్పీ దేవకుమార్‌, సీఐ ఎన్‌ శ్రీనివాస్‌,ఎస్‌ఐ శ్రీహరిబాబు ఉన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 12:35 AM

Advertising
Advertising