అక్రమాలకు పాల్పడ్డ అధికారులను వదలం
ABN, Publish Date - Aug 21 , 2024 | 01:14 AM
గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులను వదిలే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం తిలక్‌రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 20: గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులను వదిలే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం తిలక్‌రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆవ భూముల కుంభకోణంలో డబ్బులెలా చేతులు మారాయనే ఆధారాలు తీసుకుంటున్నామని అన్ని బయటకు వస్తాయన్నారు. దీనిపై హౌస్ కమిటీ వేయాలని స్పీకర్ అయ్యనపాత్రుడు అన్నారని చెప్పారు. జగన్ చేసిన నేరాల్లో అధికారులను భాగస్వామ్యం చేశాడన్నారు. అప్పుడు అతిచేసి ఇప్పుడు గత ప్రభుత్వ నిర్వాకాలకు ఆధారాలు లేకుండా చేయాలని ఫైళ్లను తగుల బెట్టడం వంటివి చేస్తున్నారని, అటువంటి వారిని వదిలిపెట్టమన్నారు. రెడ్‌బుక్‌లో ఉన్న వాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పదవిలో ఉన్నప్పుడు కనీసం బీసీ వసతిగృహాలను పట్టించుకోని మంత్రి చెల్లుబోయిన వేణు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. జాంపేట కోఆపరేటివ్ అర్బన్‌బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రొబ్డి విజయశేఖర్‌ను ఎమ్మెల్యే వాసు అభినందిం చారు. సమావేశంలో డైరెక్టర్లు ద్వారా పార్వతిసుందరి, బీరా శ్రీనివాస్, పూ ర్ణిమ ప్రసాద్, జామిశెట్టి గాంధీ, మహంతి లక్ష్మణరావు, జామి కృష్ణ, కనకం నాగేశ్వరరావు(నాని), బూరా రామంచంద్రరావు పాల్గొన్నారు.
ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేశాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్టవేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 47వ డివిజన్‌లో మంగళవారం రాత్రి నగరపాలక సంస్థ, పోలీస్, ఎకై్ౖసజ్ శాఖల సంయుక్త ఆఽధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన మీ భద్రత-మా బాధ్యత సభకు ఆయన హాజరయ్యారు. గంజాయి, బ్లేడు బ్యాచ్‌ల నిర్మూలనకు కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళలకు రక్షణ కల్పించడమే తమ ఽధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో బేసరి చిన్ని, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 01:14 AM