ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గుబుల్‌ గుబుల్‌గా

ABN, Publish Date - May 26 , 2024 | 01:01 AM

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం మరింత దగ్గరపడుతున్న కొద్దీ జిల్లా వైసీపీలో వణుకు పెరుగుతోంది. ఫలితాలు పార్టీకి ఏమాత్రం అనుకూలంగా ఉండవంటూ అనేక సర్వేలు తేటతెల్లం చేస్తుండడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటనేదానిపై కలవరం అంతకంతకూ ఎక్కువవుతోంది. అసలు జిల్లాలో పార్టీకి వచ్చే సీట్లపై ఇంతవరకు స్పష్టత కూడా రాకపోవడంతో ఓటమి భయంతో తల పట్టుకుంటోంది.

ఎన్నికల ఫలితాల గడువు దగ్గరపడుతున్నకొద్దీ జిల్లా వైసీపీలో టెన్షన్‌ టెన్షన్‌

జిల్లాలో వచ్చే సీట్లపై స్పష్టత లేకపోవడంతో వెన్నాడుతున్న ఓటమి భయం

నియోజకవర్గాల్లో తమ విజయావకాశాలపై పందేల ఊసే లేక అభ్యర్థుల్లో కలవరం

ఇప్పటికే భారీ పోలింగ్‌ శాతంతో కొంపమునిగిందంటూ అనుచరుల వద్ద ఆందోళన

పోలింగ్‌ సరళిపై ఐప్యాక్‌ సైతం ప్రతికూల నివేదికలివ్వడంతో గెలుపుపై అయోమయం

అటు కూటమి పోటీ ప్రభావంతో నెగ్గే అవకాశాలు లేవన్న అంచనాలతో ముందే కుదేలు

మరోపక్క టికెట్‌ కోల్పోయిన ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలైతే ఒడ్డున పడ్డామంటూ ఖుషీ

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం మరింత దగ్గరపడుతున్న కొద్దీ జిల్లా వైసీపీలో వణుకు పెరుగుతోంది. ఫలితాలు పార్టీకి ఏమాత్రం అనుకూలంగా ఉండవంటూ అనేక సర్వేలు తేటతెల్లం చేస్తుండడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటనేదానిపై కలవరం అంతకంతకూ ఎక్కువవుతోంది. అసలు జిల్లాలో పార్టీకి వచ్చే సీట్లపై ఇంతవరకు స్పష్టత కూడా రాకపోవడంతో ఓటమి భయంతో తల పట్టుకుంటోంది. అటు అభ్యర్థులు సైతం నియోజకవర్గాల్లో తమ విజయావకాశాలపై కనీసం పందాలు కూడా జరగడం లేదని తెలిసి పొంచిఉన్న ఓటమి తో బెంగపడుతున్నారు. ఎక్కడ చూసినా టీడీపీ కూటమి విజయం, ఆ పార్టీ అభ్యర్థుల మెజా ర్టీలపైనే బెట్టింగ్‌లు జరుగుతుండడంతో తమ భవిష్యత్తు ఏంటోనని తలబాదుకుంటున్నారు. ఇప్పటికే నమోదైన భారీ పోలింగ్‌ తమ కొంపముంచేదేనని లెక్కలేస్తుండగా, వెలువడుతున్న సర్వేలు, జరుగుతున్న బెట్టింగ్‌ల తీరు గెలుపు అవకాశాలపై వారంతా ఆశలు వదిలేసుకునేలా చేస్తున్నాయి. కాగా పోలింగ్‌ సరళిపై ఐప్యాక్‌ ప్రతినిధులతో ఆరా తీసినా అటు నుంచి సైతం సానుకూల ఫలితాలపై స్పందన రాకపోవడంతో కలవరపడుతున్నారు. మరోపక్క ఎన్నికల్లో సీటు కోల్పోయిన ముగ్గురు వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలైతే పార్టీకి పొంచి ఉన్న ఓటమిని గుర్తు చేస్తూ తాము ఒడ్డున పడ్డామంటూ కేడర్‌ వద్ద ప్రస్తావిస్తుండడం విశేషం.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి రానురాను సమయం దగ్గరపడుతుం డడంతో జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ కచ్చితంగా గెలుస్తామనే అంచనాలేవీ వ్యక్తంకాకపోవ డంతో ఆందోళన మరింత పెరిగింది. మరోవైపు వరుసపెట్టి వెల్లడవుతున్న అనేక సర్వేల్లో రాష్ట్రంలో వైసీపీ ఓటమి తథ్యమనే విషయం స్పష్టమవుతుండ డంతో జిల్లాలో ఆ పార్టీ ముఖ్య నేతల దగ్గర నుంచి అభ్యర్థుల వరకు అంద రిలోనూ నిస్తేజం నెలకొంది. కనీసం బహిరంగంగా ముందుకు వచ్చి జిల్లాలో పార్టీ సాధించబోయే సీట్లపై వైసీపీ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి మంత్రి, ఎమ్మెల్యేల వరకు నోరు మెదపలేదు. మరోపక్క పార్టీ జిల్లా పరిశీలకుడికి పంపే నివేదికల్లోనూ కచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయనే అంచనాలు కూడా చెప్పలేకపోతున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే నియోజకవర్గాల్లో తమ విజయావ కాశాలపై ఎక్కడా బెట్టింగ్‌లు కూడా జరగకపోవడం పలువురు వైసీపీ అభ్య ర్థులకు కునుకుపట్టనీయడం లేదు. బెట్టింగ్‌లు జరిగే పరిస్థితిని బట్టి అభ్యర్థు లు సైతం ఒక అంచనాకు వచ్చేసేవారు. ఇప్పుడు కూటమి అభ్యర్థుల విజ యంతోపాటు మెజారిటీలపై పందాలు జరుగుతుండడంతో ఉన్నకాస్తా ఆశలు వదులుకుంటున్నారు. వాస్తవానికి జిల్లాలో పలువురు అభ్యర్థులు ఎన్నికల తర్వాత సేదదీరడం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న బెట్టింగ్‌ల గురించి తమ అనుచరుల ద్వారా ఆరా తీస్తున్న సదరు అభ్యర్థులకు షాక్‌లు తగులుతున్నాయి. ఎక్కడా తాము గెలుస్తున్నట్టు పార్టీలోపల, బయ ట పందాలు జరగకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. అసలు తాము గెలుస్తా మనే పందాలు జరగకపోవడం ఏంటోనని వణుకుతున్నారు. తమ పార్టీలోనే కొందరు టీడీపీకి వచ్చే సీట్లపైనా, పవన్‌ మెజార్టీపైనా టీడీపీ నేతలతో పందాలు కాస్తున్న విషయం తెలుసుకుని కంగుతింటున్నారు. ఒకరకంగా ఈ పరిణామంతో పొంచి ఉన్న ఓటమి భయాన్ని తల్చుకుని కలవరపడుతున్నా రు. మరోపక్క జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా పోలింగ్‌ శాతం భారీ గా ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం తమను ముంచేయడం ఖాయమని వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే లెక్కలు వేసుకుని గెలుపు అవకాశా లపై ఆశలు వదిలేసుకున్నారు. ఇప్పుడు తమకు అనుకూలంగా బెట్టింగ్‌లు జరగకపోవడం ఓడిపోతామన్న భయాన్ని సదరు అభ్యర్థుల్లో మరింత పెంచే స్తోంది. కాగా నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళి తమకు అనుకూలమా, వ్యతి రేకమా అనేదానిపై ఇటీవల పలువురు అభ్యర్థులు నియోజకవర్గాలు, జిల్లా స్థాయి ఐప్యాక్‌ ప్రతినిధులను ఫోన్ల ద్వారాను, పిలిపించుకుని ఆరా తీశారు. ప్రధానంగా జగన్‌ సర్కారు ప్రవేశపెట్టిన భూహక్కు చట్టం ఎన్నికల్లో పార్టీని భారీగా దెబ్బతీసిందన్న లెక్కలు సదరు ప్రతినిధులు వివరించి చెప్పడంతో సదరు అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో తేలిపోవడం కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేలా చేస్తున్నా యని విశ్లేషించి వివరించడంతో అభ్యర్థుల్లో కలవరం మరింత పెరిగి పోయిం ది. అన్నింటికీ మించి కూటమి కలిసి పోటీచేయడంతో ఓట్ల సమీకరణ సైతం పార్టీకి ఏమాత్రం సానుకూలంగా లేదని అంచనా వేసుకుని ఆందోళన చెం దుతున్నారు. ఇలా తమ విజయానికి సానుకూల అంశాలు కనిపించకపోవ డంతో ఫలితాలపై సదరు అభ్యర్థుల్లో అంతకంతకు కలవరం పెంచుతోంది.

బాబోయ్‌.. బతికిపోయాం..

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు దక్కలేదు. వీరి పనితీరు ఏమాత్రం బాగోలేకపోవడం, టికెట్‌ ఇస్తే ఓడిపోతారనే లెక్కలతో పార్టీ అధ్యక్షుడు జగన్‌ వీరి సీట్లు చింపేశారు. దీంతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎన్నికల్లో పోటీచేసే అవ కాశం కోల్పోయారు. టీడీపీ, జనసేన నుంచి ఏదోలా టికెట్‌ కోసం ప్రయత్నిం చినా ఉపయోగం లేకపోయింది. అయితే పెండెం దొరబాబు మాత్రం సీఎం జగన్‌ బుజ్జగింపులతో పిఠాపురంలో పోటీచేసిన వంగాగీత కోసం ఎన్నికల్లో తూతూమంత్రంగా పనిచేశారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరం గా ఉన్నారు. అయితే ఈసారి ఫలితాల్లో టీడీపీ ప్రభుత్వం ఖాయమంటున్న సర్వేలు వెల్లడిస్తుండడంతో వైసీపీకి ఓటమి ఖాయమన్న అంచనాలతో సదరు ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఊపిరిపీల్చుకుంటున్నారు. టికెట్‌ రాలేదని మొదట్లో తాము తీవ్రంగా మథనపడ్డా, తాజాగా ఎన్నికల జరిగిన తీరు, తమ స్థానాల్లో పోటీచేసిన వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడం ఖాయమన్న అంచనా లకు వచ్చి తాము భలే బయటపడిపోయామంటూ కేడర్‌ వద్ద చెబుతున్నా రు. నిజంగా పోటీచేసి ఉంటే కోట్ల ఖర్చు పోయే.. ఓటమి మిగిలే అన్నట్టు పరిస్థితి ఉండేదంటూ తమ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తుండడం విశేషం.

Updated Date - May 26 , 2024 | 01:01 AM

Advertising
Advertising