ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

23న ప్రతి గ్రామంలో సభలు

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:21 AM

ఉపాధి హామీ పఽథకం కింద చేపట్టాల్సిన పనులను గుర్తించి నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. ఈ నెల 23న ప్రతిగ్రామంలో సభలు నిర్వహించాలన్నారు. అమలాపురంలోని కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఉపాధి హామీ పనులపై వివిధ శాఖల అధికారులతో కన్వర్జెన్స్‌ సమావేశం నిర్వహించారు.

అమలాపురం, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పఽథకం కింద చేపట్టాల్సిన పనులను గుర్తించి నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. ఈ నెల 23న ప్రతిగ్రామంలో సభలు నిర్వహించాలన్నారు. అమలాపురంలోని కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఉపాధి హామీ పనులపై వివిధ శాఖల అధికారులతో కన్వర్జెన్స్‌ సమావేశం నిర్వహించారు. అధికారులు తమ శాఖలలో ఉపాధి హామీ పనులు కింద చేయడానికి అవకాశం ఉన్న వాటిని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ పఽథకం కింద 57 లక్షల పనిదినాలను జిల్లాకు లక్ష్యంగా నిర్ణయించారు. పనులను గుర్తించి ఈ లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 266 రకాల పనులను మెటీరియల్‌, లేబర్‌ కాంపోనెంట్ల కింద చేపట్టవచ్చునని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ శాఖల పరిధిలో ఉపాధి పథకం కింద చేపట్టే పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, ఇతర మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు గుర్తించాలని సూచించారు. ఆగస్టు 23న గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించి పనులు నిర్ణయించాలని సూచించారు. ఈ గ్రామ సభలకు 30 శాతం మంది ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సభలలో వేజ్‌ సీకర్స్‌కు ఉపాధి పధకం కింద కలిగే హక్కులపై అవగాహన కల్పించాలని పనుల పురోగతిపై సమాచారం చెప్పాలని, 2024-25లో చేపట్టే పనులు ప్రతిపాదనలు తెలిపాలని, సోషల్‌ ఆడిట్‌పై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. మండల స్థాయి అధికారులు ముందుగా సమావేశమై ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. మరో రెండు రోజుల్లో జరిగే కన్వర్జెన్సీ సమావేశానికి అధికారులు నివేదికలు సమర్పించాలని సూచించారు. జేసీ టి.నిషాంతి, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ మధుసూదన్‌, జిల్లా హార్టీకల్చర్‌ అధికారి బీవీ రమణ పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:21 AM

Advertising
Advertising
<