గంజాయి అరికట్టడానికి ప్రణాళిక సిద్ధం: మంత్రి
ABN, Publish Date - Jul 15 , 2024 | 12:33 AM
నియోజకవర్గంలోగంజాయి రవాణా, వాడకం అరికట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.
ద్రాక్షారామ,జూలై14: నియోజకవర్గంలోగంజాయి రవాణా, వాడకం అరికట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆదివారం వెలంపాలెంలో నంగిగోవిందు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో మంత్రి మాట్లాడారు. వైసీపీ పాలనలో నియోజకవర్గంలో వ్యవస్థలు పాడయ్యాయన్నారు. ద్రాక్షారామ భీమేశ్వరాలయం, ఏరియాఆసుపత్రుల్లో అవినీతి చోటు చేసుకుందన్నారు. చివరకు శ్మశానాన్ని కూడా వదల్లేదన్నారు. నాలుగున్నరేళ్ల వరకు వైసీపీ నుంచి ఎవరినీ పార్టీలో చేర్చుకోబోమన్నారు. జనసైనికుల వల్లే తాను గెలుపొందానని ప్రకటించారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, టీడీపీ నాయకులు గంధం పల్లం రాజు, వాసంశెట్టి సత్యం, జడ్పీమాజీ వైస్ చైర్మన్ చింతపల్లి వీరభద్రరావు, రేవు శ్రీను, చవ్వాకుల సూర్యభాస్కరరావు, చిక్కాల దొరబాబు, ముప్పనపల్లి గణేష్, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, నంగి గోవిందు,జనసేన,టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2024 | 12:33 AM