ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చదువుకు.. వయసుతో పనేంటి!

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:40 AM

మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ కర్రి రామారెడ్డికి మరో పేరుంది. అదే నిత్య విద్యార్థి.. ఎందుకంటే ఆయన ప్రస్తుతం 38వ డిగ్రీ అందుకున్నారు. చదువుకు వయసుతో పనిలేదని మరో సారి నిరూపించారు.

పుస్తకావిష్కరణలో డాక్టర్‌ కర్రి రామారెడ్డి

రాజమహేంద్రవరం కల్చరల్‌ ఆగస్టు 20: మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ కర్రి రామారెడ్డికి మరో పేరుంది. అదే నిత్య విద్యార్థి.. ఎందుకంటే ఆయన ప్రస్తుతం 38వ డిగ్రీ అందుకున్నారు. చదువుకు వయసుతో పనిలేదని మరో సారి నిరూపించారు. ఇటీవల ఐఐటీ రూర్కెలాలో సర్టిఫి కెట్‌ ఇన్‌ బాడీ లాం గ్వేజ్‌ కోర్సు పూర్తి చేసి 38వ డిగ్రీ అందుకున్నారు.ఈ మేరకు మంగళవారం ప్రకాష్‌ నగర్‌లోని మానస హాస్పిటల్‌లో అరసం సభ్యులు ఘనంగా సత్కరించారు. అరసం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ డాక్టర్‌ కర్రి రామారెడ్డి 38 డిగ్రీలు సాధించడం ఎంతో మందికి స్ఫూర్తి అన్నారు. డాక్టర్‌ రామారెడ్డి మాట్లాడుతూ నా దైనందిన జీవితం లో ఎప్పటికప్పుడు కొత్తవాటిని నేర్చుకోవడంలో ఒక భాగంగా భావించడమే ఇన్ని డిగ్రీలు చేయడానికి దోహ దపడిందన్నారు.అనంతరం పడాల వీరభద్రరావు రచిం చిన అల్లూరి సీతారామరాజు వాస్తవ గ్రంథాన్ని ఆవిష్క రించారు.కార్యక్రమంలో ఎస్‌ఆర్‌.పృఽథ్వీ,సేవారత్న లోల భట్టు శ్రీనివాసరాజు, బీహెచ్‌ .రమాదేవి, పీవీబీ.సంజీవ రావు, మల్లెమొగ్గల గోపాలరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:40 AM

Advertising
Advertising
<