ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా 8,600 భక్తి మండలి గ్రూపులు

ABN, Publish Date - Jun 08 , 2024 | 12:55 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తిదాసుడైన పురందరదాసు కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి దాస సాహిత్య ప్రాజెక్టు విశేష కృషిచేస్తోందని, ఇందులో భాగంగా 8,600 మహిళ భక్తిమండలి గ్రూపులు ఏర్పాటు చేశామని దాస సాహిత్య ప్రాజెక్టు అధికారి ఆనందతీర్ధాచార్యులు తెలిపారు.

టీటీడీ సాహిత్య ప్రాజెక్టు అధికారి ఆనందతీర్థాచార్యులు

ఆలమూరు, జూన్‌ 7: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తిదాసుడైన పురందరదాసు కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి దాస సాహిత్య ప్రాజెక్టు విశేష కృషిచేస్తోందని, ఇందులో భాగంగా 8,600 మహిళ భక్తిమండలి గ్రూపులు ఏర్పాటు చేశామని దాస సాహిత్య ప్రాజెక్టు అధికారి ఆనందతీర్ధాచార్యులు తెలిపారు. ఇందులో 4,500 గ్రూపులు యాక్టివ్‌గా పని చేస్తున్నాయన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమజిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు విచ్చేసిన ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో దాస సాహిత్యం ప్రాచుర్యం పొందిందన్నారు. పురందరదాసు 4.75 లక్షల సంకీర్తనలు రచించారని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 46ఏళ్ల క్రితం టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఏర్పాటు చేసిందన్నారు. పురందరదాసు కీర్తనల సారాంశాన్ని వివరించి మండలి గ్రూపులకు నేర్పిస్తామని వివరించారు. కోలాటం ద్వారా కూడా సంకీర్తనలు ఆలపించే విధంగా నేర్పిస్తున్నట్టు చెప్పారు. గుమ్మిలేరులో ఈనెల 6, 7 తేదీల్లో శిక్షణ ఇచ్చామన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఈ ఏడాది రూ.2.30 కోట్లు బడ్జెట్‌ కేటాయించారని పీవో ఆనందతీర్థాచార్యులు తెలిపారు. ప్రాజెక్టుకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు బడ్జెట్‌ పెంచితే దక్షిణ భారతదేశంలో ప్రచారం చేయడానికి వీలుకలుగుతుందన్నారు. గ్రూపులకు పలు ఆధ్యాత్మిక క్షేత్రాల్లో వర్క్‌షాపులు నిర్వహిస్తున్నట్టు వివరించారు. విలేకరుల సమావేశంలో దాస సాహిత్య ప్రాచుర్యకర్త పి.ముకుందేశ్వరస్వామి పాల్గొన్నారు.

జే సత్కరించారు.

Updated Date - Jun 08 , 2024 | 12:55 AM

Advertising
Advertising