ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాకినాడ.. ఏచూరి!

ABN, Publish Date - Sep 13 , 2024 | 01:03 AM

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారన్న వార్తతో సీపీఎం నేతలు, వారి కుటుంబంతో పరిచయం ఉన్న వారంతా విషాదంలో మునిగిపోయారు. సీతారాంకు కాకినాడతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన తల్లి ఇక్కడే నివాసం ఉండడంతో ఆయన వచ్చి వెళుతుండేవారు.

ఏచూరి టవర్స్‌

  • సీతారాంకి కాకినాడతో ఎంతో అనుబంధం

  • తల్లిదండ్రులను కలవడానికి పలుమార్లు రాక

  • 2010లో సీపీఎం కార్యాలయం ప్రారంభానికి హాజరు

  • కడియంలోని జేగురుపాడులో జన్మించిన తల్లి కల్పకం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారన్న వార్తతో సీపీఎం నేతలు, వారి కుటుంబంతో పరిచయం ఉన్న వారంతా విషాదంలో మునిగిపోయారు. సీతారాంకు కాకినాడతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన తల్లి ఇక్కడే నివాసం ఉండడంతో ఆయన వచ్చి వెళుతుండేవారు.

సీపీఐ జాతీయ ప్రధాన కార్య దర్శి సీతారాం ఏచూరికి కాకినాడ అంటే చాలా ఇష్టం. ఆయన కుటుంబానికి కాకినాడలో ఏచూరి టవర్స్‌ పేరుతో ఓ అపార్ట్‌మెంట్‌ కూడా ఉంది. సీతారాం ఏచూరి తల్లిదండ్రులు కాకినాడలోనే ఉండే వారు. ఆయన తల్లి కల్పకం ఏచూరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కడియంలోని జేగురుపాడు. అయితే ఉద్యోగ రీత్యా ఆమె కాకి నాడ లోనే ఉండేవారు. వారు నిర్మించుకున్న ఏచూరి టవర్‌లోనే నివాసం ఉండేవారు. సీతారాం తండ్రి కూడా తర్వాత కాకినాడలోనే ఉండే వారు. అయితే కొన్నేళ్ల కిందట వీరు మరణించారు. అయితే తల్లి కోసం పలుసార్లు సీతారాం ఏచూరి కాకినాడకు వచ్చేవారు. అదే సమయంలో జిల్లా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. 2010లో కాకినాడలో సీపీఎం జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం జరగ్గా, సీతారాం ఏచూరి పాల్గొన్నారు. తల్లి అంటే సీతారాం ఏచూరికి ఎంతో ఇష్టం. ఎక్కడున్నా ఫోన్‌లో తల్లిని పలకరించేవారని జిల్లా పార్టీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. సీతారాం ఏచూరి అందరితో ఆప్యాయంగా మాట్లాడేవారని, కష్టసుఖాలు అడిగేవారని ఆయనతో పనిచేసిన పలువురు జిల్లా నేతలు గుర్తుచేసుకుంటున్నారు. అయితే తల్లి మరణానికి ముందే కాకినాడ కుళాయి చెరువు ఎదురుగా ఉన్న ఏచూరి టవర్స్‌ను విక్రయుంచేసినట్టు అక్కడ ఉన్న వారు పేర్కొన్నా రు. ఏచూరి టవర్స్‌ పేరుతో ఆయన జ్ఞాపకం మిగిలే ఉంది.

Updated Date - Sep 13 , 2024 | 01:04 AM

Advertising
Advertising