ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రానున్నది కూటమి ప్రభుత్వమే...

ABN, Publish Date - May 11 , 2024 | 01:44 AM

రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని బుచ్చయ్యనగర్‌, శ్రీల క్ష్మికాలనీ, గణేష్‌నగర్‌, అర వింద్‌నగర్‌లలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆయన కుమార్తె కంఠమనేని శిరీషలు ప్రచారం నిర్వహించారు.

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆయన కుమార్తె శిరీషల ప్రచారం

కడియం/రాజమహేంద్రవరంరూరల్‌, మే 10: రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని బుచ్చయ్యనగర్‌, శ్రీల క్ష్మికాలనీ, గణేష్‌నగర్‌, అర వింద్‌నగర్‌లలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆయన కుమార్తె కంఠమనేని శిరీషలు ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. గోరంట్ల మాట్లాడుతూ ప్రజలకు మంచి రోజుల రాబోతున్నాయన్నా రు. వైసీపీ ప్రభుత్వం పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్నది కూటమి ప్రభుత్వం అన్నారు. కూటమి ఎమ్మె ల్యే అభ్యర్థిఽ పోటీచేస్తున్న తనకు తెలుగుదేశం-సైకిల్‌ గుర్తుపైనా, ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ-కమలం గుర్తుపైనా ఓటేసి విజయం చేకూర్చాలని గోరంట్ల విజ్ఞప్తి చేశారు.

తండ్రి విజయానికి తాను సైతం....

ఆరు సార్లు ఎమ్మెల్యేగాను.. ఒక పర్యాయం మంత్రిగాను.. పదోసారి ఎన్నికల పోటీలో నిలిచిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి విజయానికి తన కుమార్తె కంఠమనేని శిరీష ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఏ గ్రామంలో నిర్వహించాలి ? అనే విషయాన్ని ముందురోజు ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు సమాచారం అందించి ఉదయం 8 గంటల నుంచి మఽద్యాహ్నం 1 గంటవరకు, తరువాత 4 గంటల నుంచి రాత్రి 9, 10 గంటల వరకు పార్టీ శ్రేణులతో కలిసి ప్రచార ం చేస్తున్నారు. ఉమ్మడి మెనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నా రు. ఒక్కోసారి తండ్రితో పాటు, ఒక్కోసారి తాను ప్రచారం నిర్వహిస్తున్నారు. నందమూరి తారకరామారావు స్ఫూర్తితో రాజకీయ ప్రవేశంచేసిన తన తండ్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎన్టీఆర్‌ ప్రభుత్వంలోనూ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వంలోనూ ఎమ్మెల్యేగా, మంత్రి గా అటు రాజమహేంద్రవరం సిటీ, ఇటు రాజమహేంద్రవరంరూరల్‌ ప్రాంతాలను అబివృద్ధి చేశారంటున్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం- సైకిల్‌ గుర్తుపై ఓటేసి తన తండ్రి బుచ్చయ్యచౌదరికి, ఎంపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ -కమలం గుర్తుపైనా ఓటేసి విజయాన్ని అందించాలని, కూటమిని అధికారంలోకి తీసుకు రావాలని కంఠమనేని శిరీష ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎర్రకొండపై ప్రచారంలో శిరీష

ధవళేశ్వరం: సైకిల్‌ గుర్తుకు ఓట్లు వేసి తన తండ్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గెలిపించాలంటూ కుమార్తె కంఠమనేని శిరీష ఎర్రకొండపై కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సైకిల్‌ గుర్తుపై, పార్లమెంట్‌ అభ్యర్థిగా పురందేశ్వరికి కమలం గుర్తుపై ఓట్లువేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మజ్జి పద్మ, ఎన్‌. ప్రియాంక, ఆళ్ళ ఆనందరావు, నాళ్ళ రమేష్‌, దొడ్డి బాబ్జి, ఇళ్ళరాంబాబు, దూది సాయి, ఆవాల శివ, బీరా ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆలోచించండి .. నిర్ణయాలు తీసుకోండి... కూటమిని గెలిపించండి

ఫఅభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉంటాం

ఫ రోడ్‌ షోలో సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌,

ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి

రాజమహేంద్రవరం సిటీ, మే 10 : విజ్ఞులైన రాజమహేంద్రవరం ప్రజలారా... ఆలోచించండి.....నిర్ణయాలు తీసుకోండి..... టీడీపీ, జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి అని సిటీ నియోజకవర్గ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిలు కోరారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం స్థానిక 34, 35, 36, 39, 41 డివిజన్లలో రోడ్‌ షో నిర్వహించారు. తొలుత శేషయ్యమెట్ట నుంచి రోడ్‌షో ప్రారరంభమైంది. అక్కడి నుంచి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, జనసేన సిటీ ఇంచార్జీ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై.శ్రీను, బీజేపీ సిటీ ఇంచార్జీ యెనుముల రంగబాబు, జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు టీడీపీ,నాయకులు, కార్యకర్తలలతో కలిసి రోడ్‌ షో చేశారు. ఆర్యాపురం పైర్‌ స్టేషన్‌ మీదుగా సాయి ఆసుపత్రి రోడ్డు, వడ్డీల పేట మలుపు నుంచి ఆర్యాపురం ఎన్‌ఆర్‌సీపీ రోడ్డు మీదుగా ఆర్యాంపురం సత్యనారాయణస్వామి దేవస్థానం, గాంధీ బొమ్మసెంటర్‌ మీదుగా గోకవరం బస్టాండ్‌, లేపాక్షి సెంటర్‌ మీదుగా కోర్లంపేట, తుమ్మలావ సాయిబాబా ఆలయంరోడ్డు మీదుగా రామచంద్రరావుపేట, లింగంపేట, కృష్ణనగర్‌ తదితర ప్రాంతాలలో రోడ్‌ షో నిర్వహించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నియంత జగన్‌తో గత ఐదేళ్లుగా యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ యుద్ధం అంతిమదశకు చేరుకుందన్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే జగన్‌ మళ్లీ వస్తే మన బతుకులు చిధ్రం కాకతప్పదన్నారు. భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. మొన్నపడిన అర్ధగ ంట వర్షానికి రాజమహేంద్రవరం పరిస్ధితి ముఖ్యం ఈప్రాం తాల పరిస్థితి మనం చూసాం కాబట్టి వైసీపీని ఓడించాలన్నారు. లేకుంటే ఈవిధుల్లో తిరడానికి భరత్‌ రామ్‌ పడవలు కొనిఇస్తాడన్నారు. నగరపాలక సంస్థ నిధులతో అనాలోతంగా నిర్ణయాలు తీసుకుని డివైర్లు, హైట్‌చేసి, పుట్‌ పాత్‌లు హైట్‌ చేసి, నగరాన్ని మురికి కూపంగా మార్చేశాడన్నారు. తాము గెలిస్తే ఈ ప్రాంతంలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిఒక్కరికి మేలు జరిగిందని అటువంటి పాలన కావాలంటే ఈ ఎన్నికల్టో ఎమ్మెల్యేగా తనకు సైకిల్‌ గుర్తుపైన, ఎంిపీగా దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపైన ఓట్లు వేయాలని కోరారు. నగరాన్ని హెల్త్‌ సిటీగాను, టూరిజం హబ్‌గాను, స్పోర్ట్స్‌ హబ్‌గాను, మహిళ రక్షణదళం ఏర్పాటు వంటి వి పక్కాగాచేసి చూపిస్తామన్నారు. పేదలకు మేలు చేయడం, సంక్షేమం అభివృద్ధి అందిచడం ప్రధానంగాని స్థానికత్వం కాదన్నారు. అనంతరం దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ మాట్లాడితే స్థాకేతరులు అని తనను సంబోదిస్తున్న భరత్‌ రా మ్‌ అతను స్థానికుడై ఉండి చేసింది ఏమిటని ప్రశ్నించారు. రాజమహేంద్రవరాన్ని ముంపుబారిన పడేయ్యడమేనా అని ప్రశ్నించారు. ప్రతి పేదవారికి న్యాయం జరగాలన్నారు. నగరంలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌తో కలిసి రాజమహేంద్రవరం అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటామన్నారు. 25 శాతం కమిషన్‌ను జోబిలో వేసుకోవడానికి పనిచేసిన వారు కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు. కూటమిని అధికారంలోకి తీసుకురావాలని అందుకోసం ఈనెల 13న ఎండ కాసినా, వాన కురిసిన పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లి మొదటి ప్రాధాన్యత ఓటును కమలం గుర్తుపై వేసి తనను, రెండోవ ప్రాధాన్యత ఓటు సైకిల్‌పైవేసి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకీరామయ్య, మాజీ కార్పొరేటర్లు రెడ్డి పార్వతి, తంగేళ్ళ బాబి, నాయకులు కరగాని వేణు, కందికొండ అనంత్‌, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేలంగి శ్రీదేవి, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణారావు, జనసేన నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

కుటుంబం అంతా నిత్యం ప్రజల్లోనే

ఎన్నికల ప్రచారంలో బత్తుల కుటుంబం

దివాన్‌చెరువు/రాజానగరం, మే 10: ప్రస్తుతం జరుగుతు న్న సార్వత్రిక ఎన్నికలలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న బత్తుల బలరామకృష్ణతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారం విస్తృతం గా చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరా మకృష్ణ, సతీమణి వెంకటలక్ష్మి, కుమార్తెలు బత్తుల వందనాం బిక, తోట ప్రత్యూషదేవి, అల్లుడు తోట పవన్‌కుమార్‌, వియ్య ంకుడు తోటరాజు నియోజకవర్గం పరిధిలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లోని గ్రామాలలో దాదాపు గత రెండు సంవత్సరాలుగా మేముసైతం అంటూ వివిధ కా ర్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. కుటుంబ సభ్యుల ంతా ఎవరికి వారు వేర్వేరుగా మూడు మండలాల్లోని గ్రామా లలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుం టూ భరోసా ఇస్తున్నారు. బలరామకృష్ణ చేస్తున్న పేవాకార్యక్ర మాలు కారణంగానే జనసేనాని పవన్‌కళ్యాణ్‌ దృష్టిని ఆకర్షిం చి రాష్ట్రంలోనే తొలిసీటుగా రాజానగరంకు జనసేన అభ్యర్థిగా బత్తులను ప్రకటించడం విశేషంగా చెప్పవచ్చు. బలరామ కృష్ణతోపాటు వెంకటలక్ష్మి, వారి కమార్తెలు రాత్రనక పగలనక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే కోట్లాది రూపాయల వ్యయంతో తన స్వగ్రామం గాదరాడలో పలు దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మికతను పెంపొందించారు. స్థానికులతోబాటు సుదూరప్రాంతాలకు చెందిన భక్తులు ఈ ఆలయాలుకు వచ్చి దర్శించుకుని తరిస్తున్నారు. నియోజక వర్గంలోని ప్రధానకూడళ్లలో ప్రత్యేక వాహనంద్వారా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అన్నదాత సుసుఖీభవ అంటూ ప్రజలాశీర్వాదాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లును కలిసి కూ టమి మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. ఓటువేసే విధా నాన్ని నమూనా ఈవీఎంలో ఓటర్లుకు వివరిస్తూ పోలింగ్‌ కేంద్రంలో ఇచ్చే రెండుఓట్లులో ఓకోటు ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందరేశ్వరికి 4వ నెంబరులో, రెండోఓటు ఎమ్మె ల్యే అభ్యర్థి బలరామకృష్ణకు 5వ నెంబరులో వేసి ఆశీర్వ దించాలని వివరంగా చెప్పి ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. వీరు ఇ ప్పటికే పలుపర్యాయాలు ఇంటింటాప్రచారం చేస్తూ ఓట ర్లును కలసి మద్దతు కోరారు. దీనికి తోడు నియోజకవర్గంలో అనేకగ్రామాలలో బత్తులకు బంధువర్గం అధికంగా ఉండడం కుడా కూటమిఅభ్యర్దుకు కలసివచ్చే అంశంగా పరిశీలకులు భావిస్తున్నారు. తమను ఎన్నికలలో గెలిపిస్తే రాజానగరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శనియోజకవర్గంగా తీర్చి దిద్దుతామని ప్రజలకు హామీఇస్తున్నారు.

ప్రజల ఆదరణ జీవితంలో మరువలేను

ఫ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి మే 10: గత ఐదేళ్లుగా వైసీపీ అరాచకాలు దాష్టికాలపై పోరాటం చేస్తున్న తనకు మద్దతు పలుకుతూ ఎన్నికల సమయంలో అభ్యర్థిత్వంపై వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా తన న్యాయ పోరాటానికి అండగా నిలిచి కూటమి అభ్యర్థిగా నన్ను ఆశీర్వదిస్తున్న ప్రజల ఆదరణ జీవితంలో మరువలేనని ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం పెదపూడి మండలం పె ద్దాడ, పెదపూడి, దోమాడ గ్రామాలలో ఆయన రాజానగరం టీడీపీ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణచౌదరి, సినీ హీరో ఆర్యన్‌ రాజేష్‌ లతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. దారి పొడవునా మహిళలు హారతులు పడుతూ ఘనస్వాగతం పలి కారు. ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణచౌదరి మాట్లాడు తూ వైసీపీ అవినీతి ఆరాచక పాలనకు చమరగీతం పాడాలని మరోసారి వైసీపీకి చాన్స్‌ ఇస్తే ప్రజల ఆస్తులు గల్లంతవడం ఖాయమని ఓటర్లు విజ్ఞతతో ఆలోచన చేసి ఓట్లు వేయాలని అన్నారు. నల్లమిల్లి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో కూటమి విజయం తధ్యమని ఐదేళ్లుగా ప్రజలు స్వాతంత్య్రం కోల్పోయి జీవిస్తున్నారన్నారు. ప్రజలను భయబ్రాంతులను చేసి అక్రమ కేసులు పెట్టించి రాచరిక పాలన సాగించారని అన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా రైతులు భూములు కాజేసేందుకు వైసీపీ పెద్దకుట్ర పన్నిందని రైతులు ఈ విష యాన్ని పరిశీలించి ఓటు వేయాలని అన్నారు. పెదపూడి మండలంలో రోడ్‌షోలో పాల్గొన్న హీరో ఆర్యన్‌ రాజేష్‌ ఓట ర్లను ఆకట్టుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

పెదపూడిలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీ చేరికలు

ఎన్నికల సమయం రెండు రోజులకు దగ్గర పడినా అనపర్తి నియోజకవర్గంలో నేటికీ వైసీపీ నుండి టీడీపీ జనసేన బీజేపీలో చేరికలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. శుక్రవారం పెదపూడిమండలంలో జరిగిన రోడ్‌షో సందర్భంగా పెదపూడికి చెందిన వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీ లో చేరారు. వీరికి రాజానగరం టీడీపీ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎన్డీయే కూటమి అభ్యర్ధి నల్లమిల్లి పార్టీ జెండాలు కప్పి ఆహ్వానించారు

బీజేపీలో చేరిన కొమరిపాలెం వైసీపీ నేతలు

బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు రాష్ట్ర సర్పంచ్‌ల సమాఖ్య గౌర వ అధ్యక్షుడు పడాల వెంకటరామారెడ్డి పడాల రాము ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వీరికి కూటమి అభ్యర్థిఽ నల్లమిల్లి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - May 11 , 2024 | 07:43 AM

Advertising
Advertising