ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిరుత కలకలం!

ABN, Publish Date - Sep 09 , 2024 | 12:38 AM

చిరుతపులి..భయపెడుతోంది. రాజమహేంద్రవరం నగరాన్ని ఆనుకుని ఉన్న రిజర్వు ఫారెస్ట్‌ ఏరియా పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుండడం శుక్రవారం సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైంది. దీంతో స్థానిక ప్రజానీకం తీవ్ర ఆందోళన చెం దుతున్నారు.

పులి సంచరిస్తున్నట్టు కెమెరాలో చిక్కిన ప్రాంతమిదే

లాలాచెరువు వద్ద రిజర్వు ఫారెస్ట్‌

మూడు రోజులుగా నక్కిన చిరుత పులి

50 ట్రాప్‌ కెమెరాలు..4 బోన్లు ఏర్పాటు

16 వరకు పుష్కరవనం మూత

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

చిరుతపులి..భయపెడుతోంది. రాజమహేంద్రవరం నగరాన్ని ఆనుకుని ఉన్న రిజర్వు ఫారెస్ట్‌ ఏరియా పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుండడం శుక్రవారం సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైంది. దీంతో స్థానిక ప్రజానీకం తీవ్ర ఆందోళన చెం దుతున్నారు. ఇప్పటి వరకూ ఆ చిరుతపులి జంతువులపై దాడిచేసిన సంఘటనలు లేవు. సీసీ కెమెరాలో మాత్రం ఒక పంది వెనుక నడుస్తున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి.ఈ మేరకు అటవీ శాఖ అధికారులు అడుగు జాడలు గుర్తించారు.

చిరుత పులి ఎక్కడ?

చిరుతపులి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనేదానికి అధికారుల వద్ద సమాధానం లేదు. హౌసింగ్‌ బోర్డు ఆటోనగర్‌ మధ్య ఒక జంతువును నోట కర చుకుని వెళుతున్న చిరుతపులిని శుక్రవారం ఒకరు చూసినట్టు ప్రచారం సాగింది.శుక్రవారం రాత్రి 11.25 గంటలకు లాలాచెరువు వద్ద ఉన్న టీవీ రిలేకేంద్రం(ప్రసార భారతి) ప్రధాన గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఒక పందిని వెంబడిస్తూ వెళ్లిన చిరుతపులి స్పష్టంగా కనిపించింది. దానికి కొంత దూరంలో ఉన్న హైవే నుంచి టీవీ రిలే కేంద్రానికి వచ్చే దారిలో పులి అడుగులు ముం దుగా గుర్తించారు. ఫారెస్ట్‌ అకా డమీకి దగ్గరలో ఉన్న వేయింగ్‌మిషన్‌ వద్ద అడుగు జాడలు గుర్తించినట్టు స్థానికులు చెబుతున్నారు. వేయింగ్‌ మిషన్‌ వెనుక ఉన్న తోట నుంచి టీవీ రిలేకేంద్రం వైపు వెళ్లినట్టు అడుగుజాడలు కనిపిస్తు న్నాయి. కానీ శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఆటోనగర్‌ ప్రాంతంలో ఒక గోడ మీద నుంచి వెళు తున్నట్టు అక్కడి వారు చెప్పినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రిజర్వుఫారెస్ట్‌ 536 హెక్టార్లు. ఈ ప్రాంతంలోనే ఉంటుందనే అంచనా ఉంది.ప్రస్తుతం వానలు పడుతుండడంతో అడవి లో చెట్ల మీద..చెట్ల కింద ఉండే పులి ఉండే అవ కాశం తక్కువ. టీవీ రిలే కేంద్రానికి సంబంధించి క్వార్టర్ల చుట్టూ తుప్పలు పెరిగాయి.శుక్రవారం రాత్రి వీటి సమీపంలోకి వెళుతూనే చిరుతపులి రిలే రిలే కేంద్రం సీసీ కెమెరాలకు చిక్కింది. బహుశా ఈ భవనాల్లో కూడా ఉండే అవ కాశం లేకపోలేదు. ఇక్కడ చాలా భవనాలు ఉన్నాయి. నిపుణులను రప్పించి వెంటనే దీనిని పట్టించాలని ప్రజ లు కోరుతున్నారు.

అడవి చుట్టూ జనావాసమే..

లాలాచెరువు సమీపంలో 536 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్‌ లాలా చెరువు -దివాన్‌చెరువు జాతీ య రహదారికి అటూ ఇటూ ఉంది. రిజర్వుఫారెస్ట్‌లో అటవీ అకాడమీ, పరిశోధన తదితర అటవీ కార్యాల యాలు ఉన్నాయి. రిలే కేంద్రం ఉంది. దాని వెనుక స్వరూపనగర్‌, రూపానగర్‌, శ్రీరామనగర్‌ ఉన్నాయి. రూపానగర్‌ మీదుగా శ్రీరాంపురం వెళ్లడానికి అటవీ దారి ఉంది. అక్కడ నుంచి దివాన్‌ చెరువు గ్రామం ఉంది. పష్కరవనం పక్క ఆటోనగర్‌ ఉంది. వీటి మధ్యనే అడవి ఉంది. ఈ అడవిలోనే చిరుత పులి పుట్టి పెరిగిందా అనే అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ పుట్టి పెరిగి ఉండొచ్చనే అనుమానం అధికా రులు వ్యక్తపరచడం గమనార్హం. ఇక్కడే పుట్టి పెరి గిందనుకుంటే దాని తల్లి ఎక్కడ.. దాని ఫ్యామిలీ ఎక్కడ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా అధి కారులు ఇది మగపులి అనీ, సబ్‌ఎడల్డ్‌ అంటే యుక్త వయసు కన్నా చిన్నదని చెబుతున్నారు. సుమారు 75 కేజీల బరువు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఇక్కడే పుట్టి పెరిగితే ఇంతవరకూ ఇక్కడ జంతువులపై దాడి చేసిన సందర్భాలు లేవు.

ఇక్కడిదా.. బయటదా?

అటవీ ప్రాంతం వెనుక జీడిమామిడి,నిమ్మ,సీతాఫలాలు, మామిడి తోటలు ఇంచుమించు అడవిలాగే ఉం టాయి. ఈ ప్రాంతంలో నిత్యం రైతులు తిరుగుతుంటారు. పశువులను తోటల్లోనే కడుతుంటారు. కానీ ఇంత కాలం ఎక్కడా ఎవరిమీదా దాడిచేసిన సందర్భం లేదు. ఈపరిసర ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు ఉన్నాయి. నిత్యం జనం సంచరిస్తుంటారు. పైగా రిజర్వు ఫారెస్ట్‌లో సిబ్బంది తిరుగుతుంటారు. వాళ్లకూ ఏ ఆనవాళ్లూ ఇంతవరకూ కనిపించలేదు. అధికారుల కథనం ప్రకారం రిజర్వు ఫారెస్ట్‌లో పులి సంచరించే ప్రాంతంలో పందులు ఎక్కువ ఉన్నాయని, బహుశా వాటినే ఆహారంగా తింటూ ఉండవచ్చని చెబుతున్నారు. ఇటీవల వరదలకు కొట్టుకొచ్చి ఫోర్త్‌ బ్రిడ్జి పరిసరాల నుంచి ఇటు వచ్చిందా అనే చర్చ సాగుతోంది. అటవీ ప్రాంతాల నుంచి వచ్చే లారీల ద్వారా వచ్చిందా అనే కోణం నుంచి చర్చ జరుగుతోంది. సాధారణంగా చిరుతపులి చెట్ల మీద ఉంటుది.. దాని వల్ల లారీలపై వచ్చేసి ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.

బోనుకు చిక్కుతుందా?

నాలుగు బోన్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.టీవీ రిలేకేంద్రానికి, ఓ నివాస ప్రాంతానికి ఓ,తోటకు మధ్యలో ఉన్న ఫారెస్ట్‌ ప్రాంతంలో ఓ బోను ఏర్పాటు చేశారు. అందులో ఓ పందిపిల్లను పెట్టారు. అది శుభ్రంగా పడుకుని ఉంది. బోనుకు ఎదురుగా చెట్లకు కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ రైతులు దీనిపై కామెంట్‌ చేస్తున్నారు. ఓ పంది పిల్లను బోనులో పెట్టడం వల్ల అది మౌనంగా పడుకుని ఉంటుందని, మేకపిల్లో, గొర్రె పిల్లో అయితే అవి అరుస్తాయని చెబుతున్నారు. ఇక్కడ పందిపిల్లను పెట్టారు.కానీ దానికి ఆహారం ఏమీ పెట్టినట్టు లేదనే విమర్శలు ఉన్నాయి.

ఇళ్ల ముందు లైట్లు వెలుగుతూ ఉండాలి..

పులి నుంచి తప్పించుకోవడానికి కొన్ని సూచనలు చేస్తూ అటవీ శాఖాధికారులు కరపత్రాలు ముద్రించి పంపిణీచేశారు. ఇళ్ల ముందు, ఇళ్ల చుట్టూ కూడా వెళుతురు ఉండేటట్టు లైట్లు ఉంచాలి. చీకటి సమయంలో బయట తిరగకూడదు. ఇళ్లబయట, పొలాల్లో పడుకోవద్దు.అడవిలోకి వెళ్ల వద్దు.పశువులను పొలాల్లో కట్టవద్దు.పులి సంచారం, అడుగుజాడలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి. చిరుతపులి చంపిన పశువులను ఎవరూ తాకవద్దు. దగ్గర కూడా ఉండకూడదు. చిరుత పులి గురించి తప్పుడు ప్రచారం చేయవద్దు. ప్రజలకు ఆందోళన కలిగించవద్దు.చిన్నపిల్లలు బయటకు ఒంటరిగా బయట, ఆటలకు రానీయవద్దు.

రిజర్వు ఫారెస్ట్‌లోనే చిరుత..

జిల్లా అటవీ శాఖాధికారిణి భరణి

దివాన్‌చెరువు, సెప్టెంబరు 8 : చిరుతపులిని పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ డీఎఫ్‌ వో, రాజమండ్రి ఇన్‌చార్జి డీఎఫ్‌వో అన్నారు. రాజానగరం మండలం దివాన్‌చెరువు సమీపంలోని రాష్ట్ర అటవీ అకాడమీలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.వర్షం కురుస్తుండడంతో చిరుత పాదముద్రలు కనుగొనడం చాలా కష్టంగా ఉందని, కెమెరాలలో కూడా కొత్తగా ఇమేజ్‌లు ఏమీ దొరకలేదని చెప్పారు.సాధారణంగా జంతువులు వర్షంలో తడవకూడదని అనుకుంటాయని.. పొదలుగా ఉన్న చోట్ల దాక్కుంటాయని తెలిపారు. ఆటోనగర్‌లో ప్రహరీగోడ మీద చిరుత తిరిగినట్టు గత రాత్రి సమాచారం అందడంతో సిబ్బంది ఆది వారం ఉదయం అక్కడకు వెళ్లి పాదముద్రల కోసం పరిశీలించి ప్రజలను విచారించారన్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి దివాన్‌చెరువు రిజర్వు అటవీప్రాంతం నుంచి మిగిలిన జంతువులు అరుస్తున్నాయని చిరుత పులి లేదా ఏదైనా జంతువు తరుముతుంటే లేక తమపక్కకు వస్తే ఇలా అరుస్తాయన్నారు. దీని వల్ల ఇదే ప్రాంతంలో చిరుత ఉందని నిర్ధారణ అవుతోందని చెప్పారు. వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు బోన్లు ఏర్పాటు చేశామని ఇపుడు ఆ చిరుతను ఎలా ట్టుకోవాలనే విషయమై చూస్తున్నామన్నారు. నాలుగు బోన్లు ఏర్పాటు చేశామని, 50 ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరిసర ప్రాంతాలలో మైక్‌ అనౌన్స్‌ మెంట్‌ చేశామని, కరపత్రాలు పంపిణీ చేశామన్నారు. ఈ నెల 16వ తేదీ వరకూ పుష్కరవనం మూసివేసినట్టు తెలిపారు. ఈ నెల 16 వతేదీ వరకూ గోదావరి మహాపుష్కరవనం మూసివేస్తున్నామన్నారు. జనావాస ప్రాంతం ఎక్కువగా ఉన్నందు న ఏదైనా సమాచారం ఉంటే తెలియ జేయాలని చెప్పారు.చిరుత సమాచారం ఉంటే 180042 95909 టోల్‌ ప్రీ నెంబరు తెలపాలని కోరారు.

Updated Date - Sep 09 , 2024 | 12:38 AM

Advertising
Advertising