ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీజీహెచ్‌లో బెడ్స్‌ 635కు పెంచాలి

ABN, Publish Date - Sep 10 , 2024 | 12:38 AM

క్రిటికల్‌ కేర్‌ భవనాన్ని ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సోమవారం మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనుల పురోగతి, వైద్య విద్యార్థులకు వసతులు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యాఽధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష చేశారు.

కలెక్టర్‌ ప్రశాంతి

  • వైద్య కళాశాల భవన నిర్మాణ సమీక్షలో కలెక్టర్‌ ప్రశాంతి

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 9: క్రిటికల్‌ కేర్‌ భవనాన్ని ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సోమవారం మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనుల పురోగతి, వైద్య విద్యార్థులకు వసతులు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యాఽధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష చేశారు. వైద్యకళాశాలకు సంబంధించి ఇంకా నిర్మాణ దశలో ఉన్న భవనాలను ఇంజనీర్లు త్వరగా పూర్తి చేసి అప్పగించాలన్నారు. ఎంసీహెచ్‌ భవనంలోని నాలుగు అంతస్తుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. మెడికోలకు సంబంధించి నిర్మాణంలో ఉన్న బాలురు, బాలికల వసతిగృహ భవనాలను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. రాజమహేంద్రవరం జీజీహెచ్‌ బెడ్స్‌ స్థాయిని 350 నుంచి 635కి పెంచాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. జీజీహెచ్‌లో రోగులకు అదనపు సౌకర్యాలు కల్పించడానికి, అదనపు షెడ్ల నిర్మాణానికి సమావేశంలో ఆమోదించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ సూర్యప్రభ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ వసుంధర, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 12:38 AM

Advertising
Advertising