ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీసీలకు వెన్నుదన్నుగా ఉంటాం

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:58 AM

బీసీల్లో వివిధ కులవృత్తుల్లో ఉన్న వారికి తొలి నుంచీ అండగా నిలిచింది టీడీపీయేనని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.

అమలాపురం రూరల్‌, ఏప్రిల్‌ 19: బీసీల్లో వివిధ కులవృత్తుల్లో ఉన్న వారికి తొలి నుంచీ అండగా నిలిచింది టీడీపీయేనని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. శుక్రవారం బండారులంకలో గ్రామ కమిటీ అధ్యక్షుడు పిచ్చిక శ్యామ్‌, మండల శాఖ అధ్యక్షుడు మల్లుల పోలయ్యల ఆధ్వర్యంలో సూపర్‌-6 పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కార్యక్రమంలో పెచ్చెట్టి విజయలక్ష్మి, చింతా శంకరమూర్తి, బట్టు పండు, బండి మణికంఠ, పెనుమాల సునీత, కాశిన ఫణీంద్ర, కొండా కుమారస్వామి, మాడా మాధవి, మంద గెద్దయ్య, కాశినబాబి, కాశిన చినబాబు, మాడా పద్మదుర్గాప్రసాద్‌, బళ్ల శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:58 AM

Advertising
Advertising