జిల్లాకు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు
ABN, Publish Date - Aug 17 , 2024 | 12:53 AM
ప్రభుత్వం 49 మంది అడిషనల్ ఎస్పీలకు స్థానచలనం కలిగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
రాజమహేంద్రవరం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం 49 మంది అడిషనల్ ఎస్పీలకు స్థానచలనం కలిగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.జిల్లా శాంతి భద్రతల విభాగం అడిషనల్ ఎస్పీగా ఏవీ సుబ్బరాజు, పరిపాలనా విభాగం అడిషనల్ ఎస్పీగా సీఐడీలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్.రాజశేఖర్ రావు నియమితులయ్యారు. సుబ్బరాజు చిత్తూరు జిల్లా సెబ్ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ ఇక్కడికి వస్తున్నారు.ఇక్కడ పరి పాలనా విభాగం అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న ఎస్‌ఆర్ రాజ శేఖర్ రాజు అన్నమయ్య జిల్లాలో అదే విభాగానికి వెళ్లారు.
Updated Date - Aug 17 , 2024 | 12:54 AM