ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆహా..అన్నవర ప్రసాదం

ABN, Publish Date - Sep 01 , 2024 | 12:53 AM

అమృతం అంటే ఎలా ఉంటుందని ఎవరినైనా అడిగితే అన్నవరం ప్రసాదంలా ఉంటుందంటారు చాలామంది.. అడ్డాకులో వేడివేడిగా ఉండే ప్రసా దాన్ని ఒక్కసారి రుచి చూశారా వదిలిపెట్టరు.. ఎవరు పెడతానన్నా కాదనరు... నోట్లో ఇలా వేసు కుంటే అలా కరిగిపోతుంది. మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చే మల్వరాజ్‌ గోధుమల ద్వారా తయారు చేసే ఈ ప్రసాదానికి మరేదీ సాటిరాదంటే అతిశయో క్తికాదు.

యాలికుల పొడి చల్లి పక్కన ఉంచిన ప్రసాదం

150 గ్రాములు రూ.20

ఏటా 2 కోట్ల ప్యాకెట్లు విక్రయాలు

ఆలయానికి రూ.40 కోట్ల ఆదాయం

రుచి.. శుచిలో అద్భుతం

గోధుమ రవ్వతో అదరహో

బయటచేసినా రాని ప్రసాద రుచి

రత్నగిరిపై 133 ఏళ్లుగా అదే ప్రసాదం

తాజాగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు

కాకినాడ (ఆంధ్రజ్యోతి)/అన్నవరం :

అమృతం అంటే ఎలా ఉంటుందని ఎవరినైనా అడిగితే అన్నవరం ప్రసాదంలా ఉంటుందంటారు చాలామంది.. అడ్డాకులో వేడివేడిగా ఉండే ప్రసా దాన్ని ఒక్కసారి రుచి చూశారా వదిలిపెట్టరు.. ఎవరు పెడతానన్నా కాదనరు... నోట్లో ఇలా వేసు కుంటే అలా కరిగిపోతుంది. మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చే మల్వరాజ్‌ గోధుమల ద్వారా తయారు చేసే ఈ ప్రసాదానికి మరేదీ సాటిరాదంటే అతిశయో క్తికాదు. ప్రసాదం తయారీలో రుచి, శుచికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అందుకే తాజాగా భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఏఐ) గుర్తింపు లభించింది. ఇప్పటికే దీనికి 2019లో ఐఎస్‌వో 22000: 2005 గుర్తింపూ లభించింది. ఏటా రెండు కోట్లకుపైగా ప్యాకెట్లు అమ్ముడవడమే అన్నవరం ప్రసాదం రుచికి నిదర్శనం.

ప్రసాదం చరిత్రకు 133 ఏళ్లు..

అన్నవరం సత్యదేవుడి ఆలయం 1891లో ప్రతిష్టితమైంది. అప్పటి నుంచి భక్తులకు గోధుమ రవ్వ ప్రసాదాన్నే అందిస్తున్నారు. అన్నవరం ప్రసాదం అంటే భక్తు లకు ఎంత ప్రీతిపాత్రమో చెప్పనక్కర్లేదు. ఉభయ గోదా వరి జిల్లాల వాసులు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఎవరిని కలవడానికి వెళ్లినా సత్యదేవుడి ప్రసాదం తీసుకెళ్లి అందించడం సర్వసాధారణం. ప్రసాదంతో వెళితే తలచిన పని త్వరితగతిన పూర్తవుతుందనేది వారి నమ్మ కం. ఎందుకంటే అన్నవరం సత్యదేవుడి ప్రసాదానికి నా ణ్యత, రుచి, శుచిలో తిరుగులేదు.. భారత ఆహార ప్రమా ణాల సంస్థ తాజాగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు నిచ్చింది. ఏటా రెండుకోట్లకుపైగా స్వామివారి ప్రసాదం ప్యాకెట్లను దేవస్థానం విక్రయిస్తోంది. ఒక్క ప్రసాదాల ద్వారా ఏటా రూ.40 కోట్ల ఆదాయం సమకూరుతోంది.

మధ్యప్రదేశ్‌ నుంచి మల్వరాజ్‌ గోధుమలు..

అన్నవరం ప్రసాదానికి అసలు అంత రుచి ఎక్కడి నుంచి వస్తోంది, అసలు ప్రసాదం ఎలా తయారు చేస్తారనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. కోట్లాది మంది భక్తుల మనసుదోచే అన్నవరం ప్రసాదం తయారీలో దేవస్థానం చాలా జాగ్రత్తలు తీసు కుంటుంది. స్థానికంగా దొరికే దినుసు లతో ప్రసాదం చేయదు. అత్యంత నాణ్యమైన వస్తువులను రప్పించి మరీ తయారుచేస్తోంది. ప్రసాదం తయారీలో అత్యంత కీలకమైన గోధుమలను ఏకంగా మధ్యప్రదేశ్‌ నుంచి మల్వరాజ్‌ రకం దిగుమతి చేసుకుంటోంది. రత్నగిరి కొండపై గోధుమ నూకగా మర ఆడించడానికి ప్రత్యేక యంత్రాలు వినియోగిస్తారు.

అన్నవరం ప్రసాదం తయారీ ఇలా..

ప్రసాదం తయారీకి 3:2:1 నిష్పత్తిలో దినుసులు వేస్తుంటారు. 45 లీటర్ల నీటిని ఎక్కువగా మరిగించి ముందుగా 15 కిలోల మర ఆడించిన గోధుమలను అందులో వేస్తారు. అరగంట ఉడికిన తర్వాత 30 కిలోల పంచదారను కళాయిలో పోసి ఉడికిస్తారు. ఆ తర్వాత స్వచ్ఛమైన ఆవునెయ్యిని మిశ్రమం చేసి ఉడికిన తర్వాత యాలకుల పొడి మిశ్రమాన్ని కళాయిలో వేస్తారు. గంటసేపు వంటస్వాములు బాకుతో తిప్పగా ప్రసాదం పూర్తిగా గోధుమరంగులోకి వస్తుంది. అప్పుడు ట్రాలీ తొట్టెల్లో కళాయిల నుంచి డంపు చేస్తారు. ట్రాలీ తొట్టెలో వేసిన తర్వాత మరోసారి యాలికల పొడి మిశ్రమాన్ని వేసి మూడు గంటలపాటు ఉంచుతారు. ఆ తరువాత ప్యాకింగ్‌ విభాగానికి తీసుకెళతారు.

విస్తరాకులే ఎందుకంటే..

సత్యదేవుడి ప్రసాదం ఇప్పటికీ విస్తరాకుల్లోనే భక్తులకు అందిస్తుంటారు. ప్రస్తుతం సాంకేతికంగా అన్నిరంగాల్లో మార్పులు వచ్చినా సత్యదేవుడి ప్రసాదం మాత్రం ఇతరత్రా ప్యాకింగ్‌ల్లో కాకుండా కేవలం విస్తరాకుల్లో వేసి విక్రయించాలని దేవస్థానం అధికా రులు నిర్ణయించారు. ప్యాకింగ్‌ సమయం లో అత్యంత వేడి కలిగిన ఈ ప్రసాదం విస్తరాకుల్లో వేయగానే ఆవిరి, సుగంధ ద్రవ్యాలతో ఆకు మధురంగా మారుతుం ది. అందుకే చాలామంది భక్తులు అన్నవ రం స్వామి ప్రసాదాన్ని ఆకుతో నాకేయాలంటూ ఛలోక్తు లు విసురుతుంటారు. ఈ విస్తరాకులను ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొస్తారు. విస్తరాకుల డిమాండు మేరకు అన్న వరం దేవస్థానం ఆధ్వర్యంలోనే కాకినాడ జిల్లా శంఖ వరం మండలం గొంది గ్రామంలో 40 ఎకరాల్లో విస్తరాకు తోటలు పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

ఏటా 2కోట్ల ప్యాకెట్ల అమ్మకాలు..

సత్యదేవుడి ప్రసాదాన్ని లొట్టలేసుకుని తినని భక్తు లుండరు. 150 గ్రాముల ప్యాకెట్లను రూ.20కి విక్రయిస్తా రు. రోజంతా విక్రయాలు అందుబాటులో ఉంటాయి.ప్రసాదం ప్యాకెట్లు ఏటా రూ.2కోట్లకుపైగా విక్రయమ వుతాయి. ఒక్కొక్క ప్రసాదం ప్యాకెట్టు 150 గ్రాముల ఉం డేలా తూనిక లేకుండా హస్తంగరిటతో విస్తరాకుల్లో వేసి 58 మంది ప్యాకింగ్‌ చేస్తారు. వీటిని బుట్టల్లో 100 ప్యాకె ట్ల చొప్పున వేసి మరో 10 మంది కావిడ మోతదారులు ప్రసాదం విక్రయ కేంద్రాలకు తీసుకెళ్తారు.ప్రసాదం భక్తులకు 24 గంటలు అందుబాటులో ఉంచుతారు. ప్ర సాదం ప్యాకింగ్‌ చేసే సమయంలో ప్యాకర్లు తలపై టోపీ చేతులకు గ్లవ్స్‌ తొడిగి ఎంతో శుచిగా తయారుచేస్తుంటారు. అన్నవరం ప్రసాదం తయారీకి 10 మంది వంటస్వాములు విడతలవారీగా విధులు నిర్వహిస్తారు. వీరంతా కొండపై తయారుచేసిన ప్రసాదాన్ని తిరిగి ఇంటికి వెళ్లి చేసినా రుచి, నాణ్యత రాదంటారు. కేవలం కొండపైనే ప్రసాదం తయారీ విభాగంలో చేస్తేనే సత్యదేవుడి మహిమతో ఇంతటి రుచి వస్తుందని పేర్కొనడం విశేషం.

Updated Date - Sep 01 , 2024 | 12:53 AM

Advertising
Advertising