ఏపీలో బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ మనుగడ ప్రశ్నార్థకం
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:49 AM
సమైక్యాంధ్రలో 1982లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ సెం టర్లను ఏర్పాటు చేశారు. నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- 2024-25 ఫస్టియర్ అడ్మిషన్లు నిలిపివేత
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 23: సమైక్యాంధ్రలో 1982లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ సెం టర్లను ఏర్పాటు చేశారు. నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కొన్ని లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, పీజీలు పూర్తి చేసుకుని ఉన్నస్థాయిలో స్థిరపడ్డారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 10వ షెడ్యూల్ ప్రకారం పదేళ్ల పాటు ఉమ్మడి కార్యాచరణలో ఇరు రాష్ట్రాల్లోను అంబే డ్కర్ యూనివర్శిటీ కేంద్రాలు నడిచాయి. ఏడాదికి ఆంధ్రప్రదేశ్‌లో 76 కేంద్రాల్లో డిగ్రీ, పీజీ కోర్సులను లక్షలాది మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.2023-24 విద్యాసంవత్సరంతో రాష్ట్ర విభజన జరిగి పదేళ్ల గడువు ముగియడంతో విభజిత ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ యూనివర్శిటీ కేంద్రాల్లో 2024-25 విద్యాసంవత్సరం అడ్మిషన్లు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు సెకండ్, థర్డ్ ఇయర్ చదువుతున్న వారు, పీజీ కోర్సులు చదువుతున్న వారు కొనసాగుతుండగా ఫస్టియర్‌కు అడ్మిషన్లు బంద్ చేశారు. దీంతో యూనివర్శిటికీ సంబంధించి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కొత్త రాష్ట్రంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీకి రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు తదితర నగరాలతో పాటు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్‌లో సెంటర్లు ఉన్నాయి. వాటిలో అడ్మిషన్లు నిలిచిపోవడంతో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా యూనివర్శిటీకి సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని సెం టర్‌లో ప్రతి ఏడాది సుమారు 2 వేల మంది అడ్మిషన్లు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫస్టియర్‌కు అడ్మి షన్లు నిలుపుదల చేశారు. అయితే ఈ ఏడాది జూలై చివరిలో తెలంగాణలో ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా అడ్మిషన్లు ప్రారంభం కాకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో విద్యార్థులు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు.
Updated Date - Aug 24 , 2024 | 12:49 AM