ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

duleep trophy అంతర్జాతీయ ప్రమాణాలతో దులీ్‌ప ట్రోఫీ

ABN, Publish Date - Aug 29 , 2024 | 11:56 PM

దులీప్‌ ట్రోఫీని అంతర్జాతీయ ప్రమాణాలతో అనంతపురం క్రికెట్‌ గ్రౌండ్‌ (ఏసీజీ)లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన త్రీమెన కమిటీ సభ్యులు, ఆర్డీటీ ప్రోగాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ తెలిపారు. జిల్లా క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయేవిధంగా నిర్వహణ ఉంటుందన్నారు.

మాట్లాడుతున్న మాంచోఫెర్రర్‌

అదేస్థాయిలో భద్రత, సదుపాయాల కల్పన

సెప్టెంబరు 5 నుంచి 22 వరకు పోటీలు

దేశంలోని టాప్‌ క్రికెటర్ల రాక

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన

త్రీమెన కమిటీ సభ్యుడు మాంచోఫెర్రర్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 29: దులీప్‌ ట్రోఫీని అంతర్జాతీయ ప్రమాణాలతో అనంతపురం క్రికెట్‌ గ్రౌండ్‌ (ఏసీజీ)లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన త్రీమెన కమిటీ సభ్యులు, ఆర్డీటీ ప్రోగాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ తెలిపారు. జిల్లా క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయేవిధంగా నిర్వహణ ఉంటుందన్నారు. గురువారం స్థానిక అనంత క్రీడాగ్రామంలోని ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా క్రికెట్‌ పండుగ జరగబోతోందని, క్రికెట్‌ ప్రేమికులకు ఇదొక అరుదైన అనుభూతినిచ్చే వేడుక అని అన్నారు. పెద్దపెద్ద నగరాలు ఫైవ్‌స్టార్‌, సెవెన స్టార్‌ హోటల్స్‌, విలాసవంతమైన సదుపాయాలు ఉండే ప్రాంతాల్లో దులీప్‌ ట్రోఫీని నిర్వహిస్తారని, అటువంటిది జిల్లాకు కేటాయించడం గర్వకారణమన్నారు. దేశంలోని టాప్‌ క్రికెట్‌ ప్లేయర్లు జిల్లాకు వచ్చి క్రికెట్‌ ఆడుతారని, జిల్లాకు గొప్పగొప్ప అవకాశాలు వస్తాయనేందుకు ఇదొక సంకేతమని చెప్పారు. ఇంటర్నేషనల్‌ పోటీల తరువాత జాతీయ క్రీడాకారులకు అత్యంత ప్రధానమైనది దులీ్‌పట్రోఫీ అని అన్నారు. ఈ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగానే బీసీసీఐ ఇండియా క్రికెట్‌ జట్టును ఎంపిక చేస్తుందన్నారు. పోటీలకు ఇండియా సెలెక్టర్లు, కామెంటేటర్లు హాజరవుతారన్నారు. స్టార్‌స్పోర్ట్స్‌, జియో చానళ్లల్లో లైవ్‌ టెలికాస్ట్‌ ఉంటుందని, ఇందుకు అనుగుణంగా భధ్రతా చర్యలు, సదుపాయాలు కల్పిస్తామన్నారు. రోజుకు కేవలం 4వేల మందికి మాత్రమే పాసులు జారీ చేస్తామని, పాసులు లేకపోతే లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మ్యాచరోజు ఉదయం 8.30గంటల నుంచి ఉదయం 10.30గంటల వరకు మాత్రమే పాసులు ఉన్నవారికి అనుమతి ఉంటుందన్నారు. మొదటి మ్యాచ ఇండియాసి-ఇండియా డి జట్ల మధ్య సెప్టెంబరు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు, రెండో మ్యాచ ఇండియాఏ-ఇండియా డి జట్ల మధ్య సెప్టెంబరు 12 నుంచి 15 వరకు, మూడో మ్యాచ ఇండియా బి-ఇండియా సి జట్ల మధ్య సెప్టెంబరు 12 నుంచి 15వ తేదీ వరకు బీ గ్రౌండ్‌లో, నాలుగో మ్యాచ ఇండియా ఏ-ఇండియా సి జట్ల మధ్య సెప్టెంబరు 19 వతేదీ నుంచి 22వ తేదీ వరకు, ఐదో మ్యాచ ఇండియా బి-ఇండియా డి జట్ల మధ్య సెప్టెంబరు 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బీ గ్రౌండ్‌లో నిర్వహిస్తారని తెలిపారు. సెప్టెంబరు 2వ తేదీన ప్లేయర్లు అనంతకు చేరుకుంటారన్నారు. 3, 4వ తేదీలలో ఏసీజీలో ప్రాక్టీస్‌ సెషనలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో దులీ్‌పట్రోఫీ ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి షాబుద్దీన, క్రికెట్‌ సంఘం జిల్లా కార్యదర్శి మధు ఆచారి, కమిటీ సభ్యులు పగడాల మల్లికార్జున, జొన్నా జయప్రకాష్‌, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 11:56 PM

Advertising
Advertising