ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

డీఎస్పీ చైతన్య రౌడీయిజం..

ABN, Publish Date - May 17 , 2024 | 03:48 AM

తాడిపత్రి డీఎస్పీగా గతంలో పనిచేసిన చైతన్య, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. టీడీపీ నాయకుల పట్ల అణచివేత ధోరణి అవలంబించారు. ఇవే కారణాలతో ఆయనను కడప జిల్లా

తాడిపత్రి డీఎస్పీగా గతంలో పనిచేసిన చైతన్య, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. టీడీపీ నాయకుల పట్ల అణచివేత ధోరణి అవలంబించారు. ఇవే కారణాలతో ఆయనను కడప జిల్లా రాజంపేటకు బదిలీ చేశారు. అలాంటి అధికారిని ఎన్నికల గొడవల సమయంలో తాడిపత్రికి తీసుకువచ్చారు. అల్లర్లను నియంత్రించే పేరిట వచ్చిన డీఎస్పీ చైతన్య.. మునుపటి ధోరణిలోనే వ్యవహరించారు. రౌడీలా ప్రవర్తించారు. ఆయన ఆదేశాలతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాసరి కిరణ్‌ను స్పెషల్‌ పార్టీ పోలీసులు జూనియర్‌ కాలేజీ మైదానానికి మంగళవారం అర్ధరాత్రి ఈడ్చుకువెళ్లారు. అక్కడ విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన దాసరి కిరణ్‌.. రక్తపు మడుగులో ఉండగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య సైతం శాంతిభద్రతలను కాపాడే విషయంలో విఫలమయ్యారు. పోలింగ్‌ మరుసటిరోజున టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపైకి వైసీపీ వర్గీయులు దండెత్తారు. రాళ్లు రువ్వారు. నియంత్రించేందుకు వెళ్లిన పోలీసులపైనా రాళ్లదాడి చేశారు. దీంతో తాడిపత్రి సీఐ మురళీకృష్ణ గాయపడ్డారు. పోలీసుల వాహనాలు ధ్వంసమయ్యాయి.

Updated Date - May 17 , 2024 | 03:49 AM

Advertising
Advertising