భావి తరాలకు డొక్కాసీతమ్మ ఆదర్శం
ABN, Publish Date - Aug 08 , 2024 | 02:00 AM
ప్రభుత్వం ఆగస్టు 15న ప్రారంభించే అన్న క్యాంటీన్లకు పేరు ఖరారు చేసే విషయంలో ఓ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది.
మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టడం సబబే
ప్రభుత్వం నిర్వహించే క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలి: పవన్
అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఆగస్టు 15న ప్రారంభించే అన్న క్యాంటీన్లకు పేరు ఖరారు చేసే విషయంలో ఓ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లు కొనసాగించాలా? డొక్కా సీతమ్మ పేరు కూడా జోడించాలా? అనే చర్చ వచ్చింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ... 2019 వరకూ ఉన్న విధంగా అన్న క్యాంటీన్లు కొనసాగించాలని సూచించారు. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన క్రమంలో క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరును కొనసాగించవచ్చనే ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తాను పాఠశాలలో చదివేటప్పుడు డొక్కా సీతమ్మ గురించి చదివిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. కంబాల కృష్ణమూర్తి రాసిన అమృత వాక్కులు అనే సంకలనాన్ని తన తండ్రి ఇచ్చారని చెప్పారు. అందులో డొక్కా సీతమ్మ దాన గుణాన్ని తెలుసుకున్నానన్నారు. అంతర్వేది దర్శనానికి ఆమె బయలుదేరితే.. దారిలో తన ఇంటికి భోజనానికి యాత్రికులు వస్తున్నారని తెలిసి దైవ దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చి ఆకలి తీర్చారని చదివానని పవన్ కల్యాణ్ వివరించారు.
Updated Date - Aug 08 , 2024 | 02:01 AM