ఉమ్మడి మేనిఫెస్టోతోనే సకలజనులకు మేలు : బీవీ
ABN, Publish Date - May 06 , 2024 | 12:35 AM
ఎన్డీఏ కూటమి ఉమ్మడి మెనిఫెస్టోతోనే సకలజనులకు మేలు జరుగుతందని మాజీ ఎమ్మెల్యే, కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
బీవీ గెలుపుకు కూటమి కృషి : రేఖాగౌడ్
చేనేతల ఆత్మీయ సమావేశం, వీవర్స్ కాలనీలో ప్రచారం
టీడీపీలోకి వెయ్యిమందికి పైగా చేరిక
ఎమ్మిగనూరు, మే5: ఎన్డీఏ కూటమి ఉమ్మడి మెనిఫెస్టోతోనే సకలజనులకు మేలు జరుగుతందని మాజీ ఎమ్మెల్యే, కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వీవర్స్ కాలనీలో జనసేన ఇన్‌చార్జీ రేఖాగౌడ్, బీజేపీ నాయకులు నరసింహులుతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎన్నికల మెనిఫెస్టో తుస్సుమందన్నారు. జనానికి ఉపయోగపడేవిదంగా లేదన్నారు. టీడీపీ మెనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయన్నారు. ఎన్నికల్లో టీడీపీని భారీమెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం జనసేన ఇన్‌చార్జీ రేఖాగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, జయనాగేశ్వరరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు వార్డు ఇన్‌చార్జీ బిజ్జె నాగరాజు, నాయకులు కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, ముల్లా కలీముల్లా, కటారి రాజేంద్రలు పాల్గొన్నారు.
ఓట్లకోసం మాచేనేతలు అంటున్నారు
పట్టణంలోని లక్ష్మిపేటలో మాచాని శివకుమార్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేతల ఆత్మీయ సమావేశంలో బీవీ మాట్లాడుతూ వైసీపీ నేతలు ఓట్ల కోసం మా చేనేతలు అంటున్నారని, పథకాలు మాత్రం ఇవ్వరని ఇది ఇక్కడ వైసీపీ అభ్యర్థి పరిస్థితి అని బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరులో చేనేతలు వేల సంఖ్యలో ఉండగా నేతన్న నేస్తం పథకం మాత్రం కేవలం 1300 మందికి మాత్రమే ఇచ్చారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారందరికీ నేతన్న నేస్తం ఇస్తామన్నారు. కార్యక్రమంలో చేనేతకార్మికులు పాల్గొన్నారు.
టీడీపీలోకి భారీగా చేరికలు
ఆదివారం పట్టణం, నందవరం, గోనేగండ్ల మండలాల్లోని బాపురం, పెద్దనేలటూరు, నెరుడుప్పల, గంజహాల్లి, వెముగోడు గ్రామాలనుంచి వైసీపీకి చెందిన వెయ్యిమందికి పైగా టీడీపీలో చేరారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 13,14వ వార్డుకు చెందిన ముస్లిం యువకులు మన నవాజ్ ఆధ్వర్యంలో 300మంది , 19వ వార్డులో ఉప్పర బసరకోడు వెంకటేష్, యూకే బీమన్నలతో పాటు పలువురు, ఎమ్మిగనూరు మండలంలోని గుడికల్, పెసలదిన్నే, మల్కాపురం గ్రామాలనుంచి దాదాపు వెయ్యి కుటుంబాలు వైసీపీని వీడీ మాజీ ఎమ్మెల్యే బీవీ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే బీవీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.
ఏనుగుబాలలో విస్తృప్రచారం : ఏనుగబాల గ్రామంలో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు జగ్గాపురం ఈరన్న, గ్రామా టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - May 06 , 2024 | 12:35 AM