YSRCP: ఈ ఒక్క మాటతో వైఎస్ జగన్ అయిపోయినట్టేనా..?
ABN, First Publish Date - 2024-02-06T19:09:20+05:30
ఏపీ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిస్థితిని పరోక్షంగా చెప్పారు. ఓ వైపు.. టీడీపీ-జనసేన పొత్తు.. త్వరలో బీజేపీ కూడా కలవనుంది.. ఈ పరిస్థితుల్లో సీఎం తీవ్ర నైరాశ్యంతో మాట్లాడిన మాటలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిస్థితిని పరోక్షంగా చెప్పారు. తాము (వైసీపీ నేతలు) తప్పు చేసి ఉంటే ఆ గాలికి ఎగిరిపోతామని.. అందుకు ఇన్ని పొత్తులు ఎందుకు అంటూ వ్యాఖ్యనించారు. చంద్రబాబు హయాంలో అదే రాష్ట్రం.. అదే బడ్జెట్ అయినా ఎందుకు సంక్షేమం లేదని ప్రశ్నించారు. తమ హయాంలో అప్పు చేసినా ఆ సొమ్మును జనం ఖాతాల్లో వేశామన్నారు. ఆ లెక్కలన్నీ అందరికీ కనిపిస్తున్నాయని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలోని డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని జగన్ నిలదీశారు.
అయ్యో.. పనైపోయిందా..?
నిజాలు చెప్పే మీడియా పైనా ఆయన నిందారోపణలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోయినా చంద్రబాబు చేసిన అప్పులు కట్టుకుంటూనే వస్తున్నామని జగన్ పేర్కొన్నారు. అయినా ఎన్నడూ సంక్షేమ పథకాలు ఎగ్గొట్టలేదని.. మేనిఫెస్టోలో 99శాతం అమలు చేశామన్నారు. ఇంకా జగన్ మాట్లాడుతూ.. ‘‘ఇంటింటి ఆర్ధిక వ్యవస్ధను మార్చేశాం. పేదలకు అండగా నిలబడగలిగాం. పేదల తలరాత, భవిష్యత్తును మార్చేలా ప్రతి రూపాయి బాధ్యతతో వారికి ఇస్తూ హ్యూమన్ క్యాపిటల్‌పై పెట్టుబడి పెట్టాం‘‘ అని నైరాశ్యంతో జగన్ చెప్పుకొచ్చారు.
తిరుగులేదు కానీ..!
‘‘ఏ ప్రభుత్వం అయినా ఐదేళ్లలో ప్రజలకు మంచి కాదు చెడు చేసిందని ప్రతిపక్షం నమ్మినప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలా? అలాంటి అవసరమేముంది? నేనే గాలికి ఎగిరిపోతాను కదా? ఒకరితో ప్రత్యక్షంగా, మరొకరితో పరోక్షంగా జాతీయ పార్టీలతోనూ కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్ధితిలో ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం బలపడలేదు... అభివృద్ది చేసిన అధికార పార్టీకి తిరుగులేదు. అందుకే ప్రతిపక్షం కుట్రలను ఆశ్రయించింది. టీడీపీ చేసే గారడీలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి‘‘ అని జగన్ పేర్కొన్నారు. చూశారుగా.. ఈ కామెంట్స్ విన్న టీడీపీ-జనసేన శ్రేణులు వైసీపీ పని అయిపోయిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
AP Politics: ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రంపై స్వరం మార్చేసిన వైఎస్ జగన్.. సడన్‌గా ఎందుకిలా..?
Updated Date - 2024-02-06T19:38:29+05:30 IST