ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ ప్రచార వాహనంపై ‘వైసీపీ’ దాడి

ABN, Publish Date - Apr 16 , 2024 | 01:08 AM

టీడీపీ ప్రచార వాహనంపై వైసీపీ కార్యకర్త దాడి చేశాడు. టీడీపీ నాయకులు తెలిపిన వివరాల మేరకు.. పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో సోమవారం ప్రచారం చేస్తున్న టీడీపీ వాహనంపై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్ల నాగార్జున దాడికి దిగాడు.

చిరిగిపోయిన ఫ్లెక్సీతో ఉన్న టీడీపీ ప్రచార వాహనం

పెళ్లకూరు, ఏప్రిల్‌ 15: టీడీపీ ప్రచార వాహనంపై వైసీపీ కార్యకర్త దాడి చేశాడు. టీడీపీ నాయకులు తెలిపిన వివరాల మేరకు.. పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో సోమవారం ప్రచారం చేస్తున్న టీడీపీ వాహనంపై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్ల నాగార్జున దాడికి దిగాడు. వాహనానికి కట్టి ఉన్న ఫ్లెక్సీలను కర్రతో కొట్టి చించేశాడు. అనంతరం వాహన డ్రైవర్‌ నెలవల గోపిపైనా కర్రతో దాడికి యత్నించగా, స్థానికులు నిలువరించారు. దాంతో వాహనాన్ని తీసుకుని డ్రైవర్‌ అక్కడినుంచి తప్పించుకుని వచ్చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న సూళ్లూరుపేట టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం వెంటనే ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు డ్రైవర్‌ కూడా పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌ గ్రామానికి చేరుకుని విచారించి, నాగార్జున ఆచూకీపై ఆరా తీశారు. సాయంత్రం స్థానిక టీడీపీ నేతలతో కలిసి నెలవల సుబ్రహ్మణ్యం పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని దాడికి పాల్పడిన వారితోపాటు అతడిని ప్రోత్సహించిన ఎన్డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐని కోరారు. దీనిపై ఎస్‌ఐ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధలను అతిక్రమించి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై ఎన్నికల నిబంధనల మేరకు కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Apr 16 , 2024 | 01:08 AM

Advertising
Advertising