తిరుపతి కలెక్టర్‌గా వెంకటేశ్వర్
ABN, Publish Date - Jul 03 , 2024 | 12:17 AM
తిరుపతి కలెక్టర్‌గా డాక్టర్ వెంకటేశ్వర్ నియమితులయ్యారు.
తిరుపతి(కలెక్టరేట్), జూలై 2: తిరుపతి కలెక్టర్‌గా డాక్టర్ వెంకటేశ్వర్ నియమితులయ్యారు. 2016 ఐఏఎ్‌సబ్యాచ్‌కు చెందిన వెంకటేశ్వర్ ప్రస్తుతం సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా, ఏపీ వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 2021లో చిత్తూరు జిల్లా జేసీ(హౌసింగ్)గా పనిచేసిన ఈయన తరువాత జేసీగా 17 నెలల పాటు విధులు నిర్వహించి వైద్యవిధాన పరిషత్‌కు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఎడమకల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌ది రైతు కుటుంబం. తండ్రి వెంకటయ్య సర్పంచ్‌గా, తల్లి కాశమ్మ జడ్పీటీసీగా కూడా పని చేశారు. వెంకటేశ్వర్ 2012లో ఆంరఽధా మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. అప్పటి కలెక్టర్, ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలరావు స్ఫూర్తితో కలెక్టర్ కావాలనుకున్నారు. ఎకరా పొలం అమ్మి ఆ డబ్బులతో హైదరాబాద్, ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు.2013లో సివిల్స్‌రాసి ఐఆర్‌ఎ్‌స(ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ సర్వీ్‌స)కు ఎంపికయ్యారు.2015లో మూడవ సారి సివిల్స్ పరీక్షలకు హాజరైతే 216వ ర్యాంకు వచ్చింది. సివిల్ సర్వీసెస్ శిక్షణ పూర్తి చేసుకున్నాక 2018లో విశాఖ జిల్లా పాడేరు సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు.ఒకటిన్నర సంవత్సరం తరువాత అక్కడే ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. 2021లో చిత్తూరు జిల్లా హౌసింగ్ జేసీగా బదిలీ అయ్యారు. జిల్లాల పునర్విభజన తరువాత చిత్తూరు జిల్లా జేసీగా 17 నెలలు పనిచేశారు.శుక్రవారం తిరుపతి కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు వెంకటేశ్వర్ తెలిపారు.
ఛాలెంజ్‌గా భావిస్తున్నా
రాష్ట్రంలోనే ప్రముఖమైన తిరుపతి జిల్లాలో పనిచేయడం ఓ ఛాలెంజ్‌గా భావిస్తున్నా.గతంలో చిత్తూరు జేసీగా పనిచేశాను కాబట్టి తిరుపతిపై అవగాహన వుంది. శ్రీవారి పాదాల చెంత కలెక్టరుగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయత్నిస్తా.ముఖ్యంగా పబ్లిక్ గ్రీవెన్స్‌పై దృష్టి పెడతా.
Updated Date - Jul 03 , 2024 | 12:17 AM