కురుగొండ్ల రామకృష్ణకే వెంకటగిరి టికెట్
ABN, Publish Date - Apr 21 , 2024 | 02:44 AM
వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను వరించింది. టీడీపీ అధిష్ఠానం శనివారం రామకృష్ణకు ఫోన్ చేసి అమరావతికి వచ్చి బీ ఫామ్ తీసుకెళ్లాలని కబురు పెట్టింది.
వెంకటగిరి/డక్కిలి, ఏప్రిల్ 20 : వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను వరించింది. టీడీపీ అధిష్ఠానం శనివారం రామకృష్ణకు ఫోన్ చేసి అమరావతికి వచ్చి బీ ఫామ్ తీసుకెళ్లాలని కబురు పెట్టింది.తొలుత మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో టికెట్‌ను ఆయన కుమార్తె కురుగొండ్ల లక్ష్మీసాయిప్రియకు కేటాయించిన విషయం తెలిసిందే.ఇప్పటికే వైసీపీ నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరిపోవడంతో దుర్బేధ్యంగా కనిపిస్తున్న తెలుగుదేశం ఇకపై మరింత స్పీడు పెంచనుంది.ఈ సందర్భంగా తన తండ్రి విజయం కోసం యువతను కూడగడతానని లక్ష్మీసాయిప్రియ ప్రకటించారు.నియోజకవర్గంలో తన తండ్రి చేసిన అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ చెప్పుకొంటున్నారని, తాను ఆ విషయాన్ని ప్రచారానికి వెళ్లినప్పుడు గమనించానన్నారు.
Updated Date - Apr 21 , 2024 | 02:44 AM