ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

cheeting ఏటీఎం కార్డు ఏమార్చి మహిళకు టోకరా

ABN, Publish Date - Aug 29 , 2024 | 01:49 AM

ఏటీఎం కార్డు వినియోగంలో సహకరించాలని కోరిన మహిళను ఓ వ్యక్తి మోసం చేసిన వైనమిది. వివరాలివి. సోమల మండలం ఇరికిపెంటకు చెందిన ధనశేఖర్‌ భార్య చెంగమ్మ ఈనెల 22న చౌడేపల్లె వచ్చింది.

సోమల బంకులో పెట్రోల్‌ వేయించుకుంటున్న నిందితుడు

చౌడేపల్లె, ఆగస్టు 28: ఏటీఎం కార్డు వినియోగంలో సహకరించాలని కోరిన మహిళను ఓ వ్యక్తి మోసం చేసిన వైనమిది. వివరాలివి. సోమల మండలం ఇరికిపెంటకు చెందిన ధనశేఖర్‌ భార్య చెంగమ్మ ఈనెల 22న చౌడేపల్లె వచ్చింది. భర్త ధనశేఖర్‌కు చెందిన యునియన్‌ బ్యాంకు ఖాతా ఏటీఎం ద్వారా కెనరా బ్యాంకు ఏటీఎంలో బ్యాలెన్స్‌ చెక్‌ చేయాలని భావించింది. ఈక్రమంలో అక్కడ ఓ వ్యక్తిని బ్యాలన్స్‌ చెక్‌ చేయాలని కార్డు ఇచ్చింది. పిన్‌ కూడా చెప్పింది. అతను బ్యాలెన్స్‌ చెక్‌ చేసి ఆ కార్డుకు బదులు మరో కార్డు ఆమె చేతిలో పెట్టాడు. కార్డు మారిందనే విషయాన్ని నాలుగురోజుల తర్వాత ఆమె గుర్తించింది. అప్పటికే సదరు వ్యక్తి రెండు దఫాలుగా రూ.25వేలు డ్రా చేసేశాడు. సోమల మండలంలోని పెట్రోల్‌ బంకులో ద్విచక్రవాహనానికి కార్డు ద్వారా రూ..100 పెట్రోల్‌ పట్టించుకుని తిరుపతి వైపు వెళ్లిపోయినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. బాధితురాలు ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 29 , 2024 | 01:49 AM

Advertising
Advertising