ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తిరుపతి డీఎస్పీగా రవిమనోహరాచారి

ABN, Publish Date - May 21 , 2024 | 02:02 AM

తిరుపతి డీఎస్పీగా ఏసీబీ డీఎస్పీ రవిమనోహరాచారి నియమితులయ్యారు. పోలింగు సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సీరియస్‌ అయిన ఈసీ ఇద్దరు డీఎస్పీలను, ఇద్దరు సీఐలను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

రవిమనోహరాచారి

తిరుపతి(నేరవిభాగం), మే 20 : తిరుపతి డీఎస్పీగా ఏసీబీ డీఎస్పీ రవిమనోహరాచారి నియమితులయ్యారు. పోలింగు సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సీరియస్‌ అయిన ఈసీ ఇద్దరు డీఎస్పీలను, ఇద్దరు సీఐలను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.వీరి స్థానంలో తిరుపతి నగర డీఎస్పీగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం,శాంతి భద్రతలపై పట్టున్న అధికారిగా పేరున్న డీఎస్పీ రవిమనోహరాచారిని నియమించింది.తిరుపతి ఈస్ట్‌ సీఐగా, తిరుమలలో విజిలెన్సు విభాగంలో, మదనపల్లె డీఎస్పీగా, చిత్తూరులో సీఐగా పనిచేసిన రవిమనోహరాచారి ప్రస్తుతం తిరుపతి ఏసీబీ డీఎస్పీగా వున్నారు.ఎన్నికల హింసాత్మక ఘటనలపై విచారణ జరపడానికి ఎన్నికల కమిషన్‌ నియమించిన సిట్‌ బృందంలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ నేపధ్యంలో త్వరలో జరగనున్న కౌంటింగ్‌ ప్రక్రియ శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా తిరుపతి డీఎస్పీగా రవిమనోహరాచారిని నియమించారు. అలాగే తిరుపతి ఎస్బీ డీఎస్పీగా ఎం. వెంకటాద్రి, అలిపిరి సీఐగా రామారావును నియమించారు. ఈయన గతంలో అనంతపురంలో విజిలెన్సు సీఐగా పనిచేసి వీఆర్‌కు బదిలీ అయ్యారు. అక్కడినుంచి ప్రస్తుతం అలిపిరి సీఐగా నియమితులయ్యారు. వీరితో పాటు తిరుపతి, చిత్తూరులో పలు ప్రాంతాల్లో ఎస్‌గా పనిచేసిన విశ్వనాఽథ చౌదరిని ఎస్బీ సీఐగా నియమించారు.తిరుపతిలో ఎస్బీ ఎస్‌ఐగా కూడా పనిచేసిన ఈయన ప్రస్తుతం అనంతపురంలో వీఆర్‌లో వుంటూ తిరుపతికి వస్తున్నారు. వీరందరూ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - May 21 , 2024 | 02:02 AM

Advertising
Advertising