ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తిరుమలలో ‘కూటమి’ ప్రచారాన్ని అడ్డుకున్న అధికారులు

ABN, Publish Date - Apr 30 , 2024 | 01:48 AM

తిరుమలలో కూటమి నాయకుల ప్రచారాన్ని మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. కూటమి తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుతో కలిసి జనసేన నేత కిరణ్‌రాయల్‌, టీడీపీ నేతలు పనబాక లక్ష్మి, సుగుణమ్మ, నరసింహ యాదవ్‌, జేబీ శ్రీనివాస్‌, ఊకా విజయ్‌కుమార్‌, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.

కూటమి అభ్యర్థి, నాయకుల ప్రచారాన్ని అడ్డుకుంటున్న అధికారులు, పోలీసులు

పోలీసులతో అభ్యర్థి, నాయకుల వాగ్వాదం

తిరుమల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో కూటమి నాయకుల ప్రచారాన్ని మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. కూటమి తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుతో కలిసి జనసేన నేత కిరణ్‌రాయల్‌, టీడీపీ నేతలు పనబాక లక్ష్మి, సుగుణమ్మ, నరసింహ యాదవ్‌, జేబీ శ్రీనివాస్‌, ఊకా విజయ్‌కుమార్‌, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. జీరోలైన్‌ నుంచి ఐదోలైన్‌ వరకు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియామావళి (ఎంసీసీ) అధికారి శ్రీనివా్‌సరెడ్డితో కలిసి డీఎస్పీ శ్రీనివాసాచారి, ఐసీ సత్యనారాయణ, సిబ్బంది కలిసి బాలాజీనగర్‌కు చేరుకున్నారు. వెంటనే ప్రచారాన్ని ఆపేయాలంటూ ఆదేశించారు. ప్రచారాల్లో ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజాగా మరోసారి అనుమతి పొందాకే కొసాగించాలంటూ అడ్డుకున్నారు. ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఇలా ప్రచారాన్ని మధ్యలో అడ్డుకోవడం ఏంటంటూ ఆరణి, కిరణ్‌రాయల్‌ పోలీసులను ప్రశ్నించారు. రేపటినుంచి తాజా నిబంధనలను పాటిస్తామన్నారు. ఈక్రమంలో అధికారులు, కూటమి నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. చివరకు అధికారులు సర్దిచెప్పడంతో కూటమి నాయకులు ప్రచారాన్ని ఆపేసి వెళ్లిపోయారు.

Updated Date - Apr 30 , 2024 | 01:48 AM

Advertising
Advertising