ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పూతలపట్టుకు ఎంఎ్‌సబాబు

ABN, Publish Date - Apr 10 , 2024 | 02:11 AM

కాంగ్రెస్‌ పార్టీ పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల అభ్యర్థులను మంగళవారం రాత్రి ప్రకటించింది. మలివిడత జాబితాలో పూతలపట్టుకు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు, గంగాధరనెల్లూరు అభ్యర్థిగా రమేష్‌ బాబుకు అవకాశం ఇచ్చారు.

ఎంఎస్‌ బాబు, రమేష్‌ బాబు

కాంగ్రెస్‌ మలివిడత జాబితా విడుదల

చిత్తూరు రూరల్‌, ఏప్రిల్‌ 9: కాంగ్రెస్‌ పార్టీ పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల అభ్యర్థులను మంగళవారం రాత్రి ప్రకటించింది. మలివిడత జాబితాలో పూతలపట్టుకు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు, గంగాధరనెల్లూరు అభ్యర్థిగా రమేష్‌ బాబుకు అవకాశం ఇచ్చారు.

వైసీపీ అభ్యర్థిపై బాబు ప్రభావం

2019లో పూతలపట్టు నుంచి వైసీపీ తరపున ఎంఎస్‌ బాబు పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ఆయన్ను కాదని సునీల్‌కుమార్‌కు వైసీపీ టికెట్‌ కేటాయించడంతో ఆయన పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరి పూతలపట్టు టికెట్‌ తెచ్చుకున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ముఖ్యంగా దళితవాడల్లో బాబుకు పట్టు ఉంది. ఆయన్ను కాదని సునీల్‌కుమార్‌కు వైసీపీ టికెట్‌ ప్రకటించిన నాటి నుంచి బాబు వర్గం అధికార పార్టీ కార్యక్రమాల్లో, వైసీపీ అభ్యర్థికి దూరంగా ఉంటూ వచ్చారు. నియోజకవర్గంలో దాదాపుగా దళితుల్లో ఎక్కువ శాతం తమిళులే ఉండటం.. తమిళ్‌ మాల వర్గానికి చెందిన బాబుకు కలిసొచ్చే పరిణామమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వీరి మద్దతు ఆయనకు ఎక్కువగానే ఉంది. ఈ కారణంగా పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా ఉంది.

మేనమామ కూతురిపైనే పోటీ

డిప్యూటీ సీఎం నారాయణస్వామి మేనల్లుడు అయిన రమేష్‌ బాబుకు గంగాధరనెల్లూరు టికెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ కేటాయించింది. వైసీపీ అభ్యర్థిగా నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మికి టికెట్‌ కేటాయించిన విషయం తెలిసిందే. గత పది సంవత్సరాలుగా నారాయణస్వామికి అనధికార వ్యక్తిగత కార్యదర్శిగా రమేష్‌ బాబు కొనసాగుతూ వచ్చారు. దీంతో నియోజకవర్గంలో రమేష్‌ బాబుకు స్థానిక నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవల నారాయణస్వామిని వ్యతిరేకించిన రమేష్‌ బాబు షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ గంగాధరనెల్లూరు టికెటును రమేష్‌ బాబుకు కేటాయించింది. దీంతో ఆ నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

Updated Date - Apr 10 , 2024 | 02:12 AM

Advertising
Advertising