ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పంట్రాంగంలో జోరుగా కోడిపందేలు

ABN, Publish Date - Apr 24 , 2024 | 02:01 AM

వాకాడు మండలంలోని మారుమూల గ్రామమైన పంట్రాంగం కేంద్రంగా కోడిపందేలు, డైమండ్‌ డబ్బా జోరుగా సాగుతున్నాయి. తడ, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆరంబాకం, శ్రీకాళహస్తి ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు వందల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు.

కోడిపందేల నిర్వహణ

ఫ రోజూ చేతులు మారుతున్న రూ.లక్షలు

వాకాడు, ఏప్రిల్‌ 23:వాకాడు మండలంలోని మారుమూల గ్రామమైన పంట్రాంగం కేంద్రంగా కోడిపందేలు, డైమండ్‌ డబ్బా జోరుగా సాగుతున్నాయి. తడ, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆరంబాకం, శ్రీకాళహస్తి ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు వందల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు.అనుమానం రాకుండా వారంలో మూడు రోజులు ఒక చోట, నాలుగు రోజులు మరో ప్రాంతంలో పందేలు నిర్వహిస్తున్నారు.పందేల కోసం రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం.చిన్నతోట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కనుసన్నల్లో పందేలు జరుగుతున్నట్టు సమాచారం.నిర్వాహకులతో కొంతమంది పోలీసులు కుమ్మక్కు కావడంతో స్థానికులు ఎవరైనా కోడి పందేలు జరుగుతున్నాయన్న సమాచారం పోలీసులకు ఇస్తే ఆ విషయం వెంటనే నిర్వాహకుడికి తెలిసిపోతోందన్న ఆరోపణలున్నాయి.పందెం రాయుళ్లు అక్కడినుంచి వెళ్లిపోయాకే పోలీసులు తూతూమంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. కోడిపందేల స్థావరాల పక్కనే డైమండ్‌ డబ్బా కూడా ఏర్పాటు చేస్తుండడంతో పందెంరాయుళ్ల జేబులు ఖాళీ అవుతున్నాయి.

Updated Date - Apr 24 , 2024 | 02:01 AM

Advertising
Advertising