పైన గాజులు.. లోపల మద్యం
ABN, Publish Date - Aug 24 , 2024 | 01:29 AM
గాజులమ్మ గాజులో.. అంటూ గ్రామాల్లో అరుస్తూ బైకుపై వస్తాడాయన. ఆడవాళ్లుంటే గాజులు చూపించేవాడు. అదే మగాళ్లకు బాక్సులో గాజుల కింద ఉంచిన కర్ణాటక మద్యం అమ్మేవాడు. ఇలా గాజులు అమ్ముతున్నట్లు నటిస్తూ కర్ణాటక మద్యం విక్రయిస్తున్న సుబ్రమణ్యంను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
గాజులమ్మ గాజులో.. అంటూ గ్రామాల్లో అరుస్తూ బైకుపై వస్తాడాయన. ఆడవాళ్లుంటే గాజులు చూపించేవాడు. అదే మగాళ్లకు బాక్సులో గాజుల కింద ఉంచిన కర్ణాటక మద్యం అమ్మేవాడు. ఇలా గాజులు అమ్ముతున్నట్లు నటిస్తూ కర్ణాటక మద్యం విక్రయిస్తున్న సుబ్రమణ్యంను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిది గంగవరం మండలం నల్లసానిపల్లె గ్రామం. కొన్నిరోజులుగా గాజులు వ్యాపారం చేస్తున్నట్లు నటిస్తూ కర్ణాటక సరిహద్దు నుంచి గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతుండేవాడు. ఇదే రూట్‌లో తిరుగుతూ ఆడవాళ్లకు గాజులు అమ్ముతూ, మగవాళ్లకు కర్ణాటక మద్యం విక్రయిస్తూ సులభంగా సొమ్ము చేసుకొనేవాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేపట్టారు. ఉయ్యాలమిట్ట గ్రామం నుంచి గడ్డిండ్లు రోడ్డులో తనిఖీలు నిర్వహించగా గాజులమ్ముతున్నానని పోలీసులను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించాడు. పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీలు చేయగా గాజుల బాక్సుల కింద టెట్రా మద్యం ప్యాకెట్లు బయటపడ్డాయి. సుబ్రమణ్యంను అరెస్టు చేసి.. 432 టెట్రాప్యాకెట్లు, ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు గంగవరం అర్బన్ సీఐ ప్రసాద్ తెలిపారు.
- గంగవరం
Updated Date - Aug 24 , 2024 | 07:43 AM