వరసిద్ధుడి సేవలో డీజీపీ
ABN, Publish Date - Jul 15 , 2024 | 01:26 AM
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామిని ఆదివారం డీజీపీ ద్వారకతిరుమలరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఐరాల(కాణిపాకం), జూలై 14: కాణిపాక వరసిద్ధి వినాయకస్వామిని ఆదివారం డీజీపీ ద్వారకతిరుమలరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం వేదాశీర్వాద మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపిక అందించారు. అనంతపురం రేంజి డీఐజీ షిముషి, ఎస్పీ మణికంఠ, సీఐ రవిశంకర్, కాణిపాకం ఎస్‌ఐ రామ్మోహన్, ఆలయ సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ ద్వారకతిరుమల రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఉండాలని దేవుడ్ని ప్రార్థించినట్లు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. రోడ్డు నియమ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదన్నారు. అన్ని కేసులను సమర్థంగా ఎదుర్కోవడానికి పోలీసులు తమ శక్తి వంచన లేకుండా శ్రమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలంటే.. అందరి సహకారం తమకు కావాలని ఆయన కోరారు.
Updated Date - Jul 15 , 2024 | 01:26 AM