బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు
ABN, Publish Date - Jul 15 , 2024 | 01:46 AM
ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏర్పేడు మండలంలో వారం కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏర్పేడు, జూలై 14: ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏర్పేడు మండలంలో వారం కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం నిందితుడైన బలరామయ్యగౌడ్ (61)ను సీఐ శ్రీరామ శ్రీనివాసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం 11గంటలకు రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు.
Updated Date - Jul 15 , 2024 | 01:46 AM