ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహారాష్ట్ర సీఎం షిండేతో చంద్రబాబు భేటీ

ABN, Publish Date - Jul 15 , 2024 | 04:59 AM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏకనాథ్‌ షిండేతో సీఎం చంద్రబాబు ముంబైలో భేటీ అయ్యారు.

ముంబై ‘వర్ష’లో అరగంట చర్చలు

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏకనాథ్‌ షిండేతో సీఎం చంద్రబాబు ముంబైలో భేటీ అయ్యారు. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ చిన్నకుమారుడి వివాహ వేడుకలకు హాజరైన చంద్రబాబు.. ఆదివారం ఉదయం 10 గంటలకు షిండే ఆహ్వానం మేరకు ఆయన అధికారిక నివాసం ‘వర్ష’కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక వసతుల కల్పన, ఆర్థికపరమైన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి దాదా భూసే, షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే పాల్గొన్నారు. సుమారు అర్ధగంట సేపు చర్చలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సామాజిక, సాంస్కృతిక వ్యవహారాల్లో రెండు రాష్ట్రాలూ సహకరించుకోవాలని నిర్ణయించారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు డిజిటల్‌ రంగంలో అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సీఎంలు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. చంద్రబాబుతో సమావేశమైన ఫోటోలను షిండే ఎక్స్‌లో షేర్‌ చేసుకున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 04:59 AM

Advertising
Advertising
<