ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ChandraBabu: మాల కుల సంఘాలతో బాబు భేటీ

ABN, Publish Date - Apr 09 , 2024 | 08:54 PM

మాల, మాదిగలు తనకు రెండు కళ్లు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం మాల కుల సంఘాల నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో నిరుపేదల అభివృద్ధే తన లక్ష్యమన్నారు.

అమరావతి, ఏప్రిల్ 09: మాల, మాదిగలు తనకు రెండు కళ్లు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం మాల కుల సంఘాల నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో నిరుపేదల అభివృద్ధే తన లక్ష్యమన్నారు. నిరుపేదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ కోసం ప్రతి గ్రామంలో పని చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

Margadarsi: మార్గదర్శి వ్యవహారంలో ఉండవల్లికి సుప్రీం సూచన

మీ అభివృద్ధే తన లక్ష్యమన్నారు. ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా దళితులు మాట్లాడుతూ.. కూటమి గెలుపు కోసం మాలలంతా కలిసి కట్టుగా పని చేస్తామని తెలిపారు. ఈ జగన్ ప్రభుత్వం రద్దు చేసిన దళిత పథకాలన్నీ రాబోయే ప్రభుత్వంలో పునరుద్దరించాలని వారు కోరాగా.. అందుకు చంద్రబాబు సరేనన్నారు. అలాగే బాబు హయాంలో దళితుల ఆర్థిక పురోగతిపై ప్రత్యేక శ్రద్ద చూపారని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


అయితే ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో తమపై దాడులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని ఆందోళన చెందారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు పెద్ద పీట వేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. అందుకే మళ్లీ మీరు రావాలంటూ.. చంద్రబాబు ఎదుట దళితులు గట్టిగా నినాదాలు చేశారు.

పార్టీ విరాళాల కోసం వెబ్‌సైట్‌ ప్రారంభించిన చంద్రబాబు

ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్, జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోగులమూడి రాము, ప్రధాన కార్యదర్శి బాపట్ల కిరణ్ కుమార్, అధికార ప్రతినిధి మద్దూరి శ్రీనివాసరావు, మాల మహాసేన అధ్యక్షులు అలగ రవి కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి జై రాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ తదితరలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 09 , 2024 | 08:58 PM

Advertising
Advertising