ఊపందుకున్న పత్తి విత్తు
ABN, Publish Date - Jun 08 , 2024 | 11:50 PM
ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతన్నలు పత్తి, పంట పైనే ఆశలు పెట్టుకున్నారు.
విత్తనాలు విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతులు
30వేల హెక్టార్లలో పత్తి సాగుకు సిద్ధం
గోనెగండ్ల, జూన్ 8: ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతన్నలు పత్తి, పంట పైనే ఆశలు పెట్టుకున్నారు. అడప దడప వర్షాలు కురు స్తుండటం మృగశిర కార్తి రావడంతో తొలకరి జల్లులు కురియడం, సాగుకు అనుకూలం అని రైతన్నలు పత్తి విత్తనాలు విత్తేందుకు సిద్దమయ్యారు. శనివారం నియోజకవర్గంలోని పలు మండలాలలో పత్తి సాగు ఊపందుకుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దాదాపు 30 వేల హెక్టార్లలో పత్తి సాగుకు సిద్ధమవుతున్నారు.
Updated Date - Jun 08 , 2024 | 11:50 PM